Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంధాలయములలోని గ్రంథముల మొత్తము ౧౦ కోట్లఁట! సంచార గ్రంధాలయములు ౧౨,000.

సినిమా రేడియోల సాయముతోడి పొ.గు. కడంకవలన రష్యా, ఇపుడు శాస్త్రీయముగా సేద్యము చేయు దేశములలో ఒకటిగా ఎన్నికకు రాఁగలిగినది.

స్వీడన్ – ఈ దేశమునకు కలపవర్తకము చేసికొనవచ్చి - డబ్బుగడించిన డబ్బుండించిన స్కాట్లాండు దేశస్ధుఁడగు డిక్సన్ అను దాత గ్రంథాలయనిధి ఒకటి ఏర్పఱుపఁగా, దానివలన ౫ గ్రంథాలయములకు ధన సాహాయ్యము జరుగుచున్నది.

హెల్సింబర్గ్ ప్రోలి పొ.గు. వారును, డెన్మార్కు లోని హెల్సింగోర్ లైబ్రరీవారును, ఒండొరులకు వలయం పొత్తములు ఎరవిచ్చిపుచ్చుకొనుచుందురు.

ఆస్ట్రియా - వియన్నా నగరములోని 'నేషనల్ లైబ్రరీ' లో ౧౨,౫౦,౦౦౦ పొత్తములు కలవు.

యూరపుఖండములోని డెన్మార్కు, హాలెండు, బెల్జియము మొదలగు నాడులలో కూడ పొ.గు.క. పైని తెలిపిన నాడులలో దానికంటే వెనుక పడలేదు. ౧౫ వ శతాబ్దిలో అచ్చువచ్చిన పిదప మొత్తముమీఁద గ్రంధాలయోద్యమము బాగుగానే సాగుచున్నది. కొన్ని నాడులలో దొరతనము వారు తోడ్పడుచున్నారు; కొన్ని నాడులలో డబ్బుగలవారు సాయపడుచున్నారు; కొన్ని నాడులలో మ్యూన్సిపాల్టీలవారు పనిచేయుచున్నారు. కొన్ని నాడులలో రెండు మూఁడు సాయములను జరుగు చున్నవి. దొరతనమువారి సాయమునకు ఉదాహరణము చూడుఁడు - జుగోస్లో వేకియాలో ౧౯౧౯ లో అచ్చటి దొరతనమువారు గ్రంధాలయ శాసన మొకటి చేసిరి; దానివలన ప్రతిపట్టణములోను, ప్రతి పల్లెలోను, గ్రంధాలయము లేర్పడవలసివచ్చుటచే, ౫ ఏండ్లలో అక్కడి పొ.గుడులు ౪౫౮ నుండి ౨,౨౪౨ వఱకు పెరిఁగి, మందికి ఎఱుక కఱపి, ఎంతయు తోడ్పడుచున్నవి.

దక్షిణాఫ్రికా — ఇది బోయరుయుద్ధము తరువాతనే పైకివచ్చినది. అయినను, దీనిలోకూడ పొ.గు.క. చక్కగా సాగుచున్నట్లు తెలియవచ్చుచున్నది. దీనికి కారణమేమని వింతపడనక్కరలేదు. స్వాతంత్య్రము చేయఁజాలనిది ఏదియు లేదు. అదే అభివృద్ధికి ముఖ్యకారణము. అది లేని వారన్ననో అడుగఁటీ పోయెదరు.

ఆ.సం.రాష్ట్రములు – సోవీట్ రష్యాను గూర్చి ముచ్చటించునప్పుడు అది అ.సం.రాష్ట్రములతో పోటీచేయుచున్నట్లు చురుకుగా పనిచేయంచున్న దనుకొంటిమి. కాన, ఇందు జరుగుపనిని గూర్చి కొంత వివరముగా తెలిసినఁగాని ఆపోటీ ఎట్టిదో తేటపడదు. ౧౯౨౮ లో పొ.గు.ఖర్చు రు.౧౦,౬౦,౩౧,౪౬౮; అనఁగా తలకు ఏడాదికి రు. ౧చో॥ ఖర్చగుచున్నది. కార్నీజీ కార్పొరేషన్ వారు ఇందలి గ్రంథాలయములకు డబ్బు సాయము చేయుచున్నారు. పొ.గు. లో చదువుకొని - బాగుపడి - కోటీశ్వరుఁడైన కార్నిజీ పైనాదులు పొ. గు. కే సాయపడినపుడు తన నాటివానికి తోడ్పడుట వింత కాదు. కాని, ఏఁడి అట్టిదాత మఱోకఁడు? కోట్లకొలఁది మ౦దికి ఎడతెగక తోడ్పడుభాగ్యము ఆయనకే కలిగినది.

వాషింగ్ ట౯ సగరములోని కాంగ్రెస్ లైబ్రరీని గుణించి ఇదివఱకు కొంత తెలిసికొంటిమి. ఇప్పుడది మఱింత పెంపొంది పనిచేయుచుండును. యేల్ నగరములోని స్టెర్లింగ్ మెమోరియల్ పొ. గు. లో ౩౫ లక్షల పొత్తములు కలవఁట. ఇట్లే న్యూయార్కు, చికాగో, ఫిలడెల్ఫియా మొదలగు నగరములలోను, పట్టణములలోను, పల్లెలలోను, పొ. గుడులు పనిచేయుచున్నవి. ఆనడుమ వచ్చిన లెక్కలనుబట్టి, ౫,౯౫౪, మంది పొ.గు. కలవనియు, ౪,౫౦,౬౯,౮౯౭, గురు పొత్తములు చదువుచున్నారనియు, వీరిలో ౧౦౦కి ౯౩ గురు పల్లెలవారనియు తేలినది. గ్రుడ్డివారికొఱకు విడిగా పెట్టిన పొ.గు.౧౫. పిల్లలకొఱకు తగిన పొత్తములు వ్రాయించి, వానిలో మేలైనవానికి కానుక లిచ్చేదరు.