వెఱనాడుల పొత్తపుగుడి మనుగడ - ఇప్పటిది
పొ.గు. కడంక పడమటినాడులలో ఇప్పుడు బాగుగా సాగుచున్నదని ఇంతకుముందే మన మనుకొంటిమి. కాన, దానివలన వలయునది నేర్చుకొనుటకు దాని మనుగడ టూకీగానైనను తెలిసికొననగు.
ఇంగ్లాండు— బ్లూమ్స్ బరీ జాతీయ కేంద్ర గ్రంధాలయము లండనునగరమున కార్నీజీ దాన సాహాయ్యమున ఏర్పడినది; ఇందలి పొత్తములు ౫౦ లక్షలు; దీని నుండి ౧౫౦ పొ.గుడులకు పొత్తములు వెళ్ళు చుండును. అంతే కాదు. ఏభోగట్టా అడిగినను తెలిపెదరు. ప్రతిదినమును సుమారు ౪౦౦ దరఖాస్తులు వచ్చుచుండును. ౧౯౩౩ లో తయారైన క్రొత్తభవనములో ఇది ఇప్పుడు వెలయుచున్నది. దీనిలో నవలలు ఉంచరు.
బ్రిటిష్ మ్యూజియములో పలుదేశములనుండి వచ్చు పొత్తములు - చిత్తరువులు - నాణెములు మొదలగునవి ఉండును; పొత్తములు ౪౦ లక్షులకు మించియుండును.
ఇట్టే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి మొదలగు నగరములలోను - పట్టణములలోను గాక, పల్లెలలో కూడ పొ. గుడులు వెలసి, కార్నిజీట్రస్టు వారుచేయు డబ్బు సాయమువలస బాగుగా పనిచేయుచున్నవి - అనఁగా ఎవరికి ఏపొత్తము కావలసిన వారికి అది అందఁజేయుచున్నవి. నడ పొ.గుడులు పెక్కులు పనిచేయుచున్నవి. ౬౦౦ పొత్తములుపట్టు న.పొ.గు. కారొకటి అనడుమ తయారు చేసినారట.
స్కాట్ లాండు— ఇందు పొత్తపుగుడిలేని పల్లె లేదఁట!
ఐర్లాండు - దీనిలో కార్నిజీట్రస్టువారి సాయమున పొ.గు. పని బాగుగనే సాగుచున్నది. అందు దక్షణ ఐర్లాండ్దలో మఱింత బాగుగా జరుగుచున్నది.
ఫ్రాన్సు-- 'బిబ్లియోథికే నేషనల్ పొ.గు. ౪౦ లక్షల పొత్తములతో పార్రిస్ పర్రీస్ నగరమున వెలయు చున్నది. తక్కినచోట్లను మంచి పొ.గుడులు కలవు. ఈ దేశమున పొ.గుడులకు సొమ్ము హెచ్చుగా వెచ్చింతురు. దొరతనమువారును, మ్యున్సిపాలిటీలవారును తమ పొ.గుడులు పల్లెలవారికి బాగుగా పనికివచ్చునట్లు చేయుచున్నారు.
జర్మని- బెర్లిన్ స్టేట్ లైబ్రరీలో ౨౩ లక్షల పొత్తములును, మ్యూనిచ్ స్టేట్ లైబ్రరీ లో ౧౬ లక్షల ౭౦ వేలును, ట్రాస్ బర్గ్ యూనివర్సిటీ లైబ్రరీలో ౧౩ లక్షల పొత్తములు కలవు. మనదేశమునుండి వెళ్ళిన పొత్తములు జర్మనీ పొ.గుడులలో పెక్కులు కలవు. మనవారు మన దేశమున దొరకని పొత్తములు జర్మనీలో వ్రాయించి రప్పించుకొందురు.
పట్టణగ్రంథాలయములు పెంపొందించి, అవి పల్లెలకు పనికివచ్చునట్లు చేయుటకు ప్రయత్నించు చున్నారు. పెక్కు ట్టణముల పొ. గుడులు అప్పుడే ఆటుచేయ పూనుకొనినవి.
ఇటలీ - రోము నగరమునందలి వాటికన్ లైబ్రరీలో ఇప్పుడు అచ్చుపొత్తములు ౫ లక్షలు; వ్రాఁత పోతములలో లాటినుని ౩౭,౦౦౦; గ్రీకువి ౪,౨౬౦; తూర్పునాడుల పలుకులవి ౪,౦౦౦; చరిత్ర గ్రంథములు ౬౦,౦౦౦. ఈ గ్రంథాలయ స్థితినిబట్టి మొత్తముమీఁద ఈ ఉద్యమ మెట్లు జరుగుచున్నదో ఊహించుకోననగును.
రష్యా - సోవీట్ దొరతనము వచ్చిన పిదప జార్ దొరతనమునాఁటి కంటే పొ.గు.క. మిక్కిలివిరివిగా పెరిఁగినది. అమెరికా సంయుక్త రాష్ట్రములను మించుటకు పోటీ చేయుచున్నట్లు నగరములలోను, పట్టణములలోను, పల్లెలలోను కూడ పని చుఱుకుగా చేయుచున్నారు. వాన కురియునపుడు కూడ పొత్తముల కొఱకు వచ్చుటయు, ఇచ్చుటయు జరుగుచుండునఁట! పొత్తముల లెక్కలో ఇది తక్కిన అన్నినాడులను మించినట్లు కానవచ్చుచున్నది. లెనిన్ స్టేట్ పొ.గు లో ౬౦ లక్షల పొత్తములును, లెనిన్ గ్రాడ్ మంది పొ.గు లో ౪౮,౩౨,౯౪౩ పుస్తకములును కలవఁట. అన్ని