ముల మొత్తమే కడలితోడి నేలపొత్తపుగుడి; ఇది ఆరయిక పస గలవారికి బాగుగా పనికివచ్చును; తక్కినవారికి అంతగా తోడ్పడదు.
అయినను, ఇట ఒక మాట చెప్పవలె. ఎల్ల అని నింగి నేల పొత్తపుగుడులు కొంచెముగానో హెచ్చుగానో వాడుకొని ఆందలి పొత్తపు తీర్పగుల తోడ్పాటుకూడ పొంది, ఎఱుక గడించుకొనినవారు వ్రాసినవే మన మేలిపొత్తములగుటచే, మనలో కొందని తగినవారు ఆటు చేయకడంగుట కడుంగడు మంచిది.
ఇఁక, మందిపొత్తపుగుడులను గూర్చి పరికింతము, ఇందు, మొదట పెఱనాడుల వానిని గూర్చియు, పిదప ఇండియావానిని గూర్చియు, తుదకు తెనుఁగు నాటివారిని గూర్చియు, ముచ్చటించుకొందము. అఁదు వాని ప్రాంతమనుగడ తొలుత కొందము. ఈమనుఁడ తెలుపుటలో చరిత్రతోపాటు, "పెద్దలమాటయు ప్రమాణముగానే గ్రహింతును - అని మీరు గుర్తింతురుగాక!
వెఱనాడుల పొత్తపుగుడి మనుగడ - ప్రా౦తది
మే.[1] అట్లాంటిస్ ఖండము- ఇదే కుశద్వీపము. సుమారు కోటియేండ్లు ఉండినను, తమలోనే కొందఱు ఇది ఉండినట్లు తెలుపుచు పొత్తములు వ్రాసినను, మొత్తముమీఁద పడమటి తెల్ల నెఱవాదులు దీని ఉనికిని గూర్చి నమ్ముకున్నారు! మేలెఱుకవారు, సుమారు ౧౦ లక్షల యేండ్ల క్రిందట ఇప్పటి యూరోపియను నాగరకతను మించిన నాగరకత, అట్లాంటిక్ పెన్కాడలిలో మునిఁగిపోయిన - ఆఖండమున వెలయుచుండెనని, తెలుపుచున్నారు. అంతేకాదు. అందు పొత్తపుగుడు లుండినట్లును,అవి ఇపుడు కడలికడుపులో ఉన్నట్లును, అవి పైకి తీయఁగ లిగిన మగవారు ఉండి, తీయంచో, వారి సందేహము లెల్ల తీఱుసనియును వారు తెలుపుచున్నారు. ఇప్పటికి పోయిన తక్కిన యెల్లపొ త్తముల విలువకంటె అట్లాంటిస్ ఖండపు పొత్తముల విలువయే ఎన్నో రెట్లు హెచ్చఁట! అవి ఎప్పుడేని పైకివచ్చు నేమో!
మే. మంగోలియా — ఇది ఇప్పటికి సుమారు ౨౫ వేల యేండ్ల క్రిందట, సుమారు 3౦-౪౦ వేల యేండ్లు సాగిన ఆర్యుల మహాసామ్రాజ్యమునకు పట్టుబొమ్మగా ఉండిన "ష౦బల్లా" మహానగరమునకు మనికిపట్టగు దేశము. అపుడు అక్కడ పొత్తపుగుడు లుండెనని తలంపనగు.
మే. టిబెట్టు ఇదే త్రివిష్టపనుని కొందఱందురు. ఇందు అడవులలోని నేలమాలియలలో ఎప్పుడో పెద్దపొత్తపుగుడులు పెట్టినారఁట! మఱియు, తమంతటతాము ఆకులమీఁద అచ్చుపడు వ్రాఁతలుగల "కౌ౯ బౌమ్" అను చెట్టు పొత్తపుగుడి వెలసినదఁట!
మే. ఇష్ మోనియా (రాతిప్రోలు) - దీనిదగ్గఱి నేలమాలేలో దాఁచిన పొత్తపు గుడికలదఁట! అందు, లెక్క లేని పొత్తములును, వ్రాత కాగితపు చుట్టలను, కలవఁట!
మే. పాలస్తీను - ఇందలి పొత్తపుగుడులలోని పొత్తములనుండి క్రిస్తవమతారంభమునుగూర్చిన విషయములు న్యూయార్కులోని ఏ.ఎల్. రాసనపండితుఁడు వ్రాసికొనెనఁట! అవి తరుణమువచ్చినపుడు "పైకివచ్చునఁట!
చాల్దియా — ఇది ఇప్పటి మెసొపొటేమియా; టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల నడిమిలోయ. ఇక్కడకు తొంటి చోళ దేశమునుండి కొందఱుచేరి, తమ దేశము పేరే దీనికి పెట్టిరి. కాన, చోళదేశ' పదమే నాఁటికి మాణి, 'చాల్దియా' అయినదని తలంపనగును. ఎటి లోయలుమందికి మంచి మనికిపట్టులగుటచే పెక్కురు వానిపై కన్ను చేసి, అందుచేర కడంగుదురు. గంగా, సింధు, నీల(నైల్) నదుల లోయలు మొదలగునవి ఇట్టివే. కాన, చాల్దియాలోయలో మొట్టమొదట తురేనియనులును, పిదప
అక్కేడియనులును, పదంపడి చోళదేశము వారును, తరువాత ఆర్యన్- సెమిటిక్ తెగలును చేరి, అక్కడనిలిచి, పెద్దఱికము
- ↑ మే. ఇది మేలెఱుక వారి పొత్త ములనుబట్టి తెలిసినదనుటకు గుర్తు.