వ్రాఁత ౧ బొమ్మల వ్రాఁత, ౨ గుర్తుల వ్రాఁత, 3 వ్రాల వాఁత అని - ముత్తెఱంగు. అందు మఱి కొన్ని మార్పులును ఉండును. బొమ్మల ప్రాఁతయే వ్రాఁతకు మొదటిరూపమని పాశ్చాత్య పండితులు పలువు రనుచున్నారు. కాని వేల్పుమందికి వ్రాలు నేర్పినట్లు తెలియవచ్చుచున్నది. అవి నానాఁటికి మాఱి, ఇపుడు పలుపలుకులకు గుర్తులుగా ఉన్నవి.
యూరపువారికి గ్రీకులు తొలిగురువులు. వారు ఫోయినీషియా వారివలన వ్రాలునేర్చుకొని, అవి వారే కని పెట్టినారని తలంచిరి. కాని, తరువాత పరిశోధింపఁగా వారికంటె ఎంతో ముందే ఈజిప్టువారు, అక్కడులు మొదలగువారు వాఁత కనిపెట్టినట్లు తెలియవచ్చినది. అది నిజమునకు ఇండియా నుండియే పైకి వెళ్ళినది. అట్లాంటియనులకు వ్రాత బాగుగా వాడుకలో ఉండినట్లు మేలె ఱుకనారు తెల్పుచున్నారు.
తెనుఁగు వ్రాఁత
ఇండియాలో "హెచ్చుగా వాడువాఁత బ్రాహ్మివాఁత; దానినుండి గుహవ్రాత పుట్టినది; దానినుండి చాళుక్యులవాఁతయు, వేంగివ్యాతయు ఏర్పడినవి. వానినుండి వరుసగా పడమటి చాళుక్యుల వ్రాఁతయు, తూర్పు చాళుక్యుల వాఁతయు పొడమినవి. వాని కలగలుపు వ్రాఁతనుండి పాత తెనుఁగు వాఁతయు, దానినుండి ఇప్పటి తెనుఁగు వాఁతయు పుట్టినవి. పైకలగలుపు వాఁతనుండియే కన్నడపు వాఁతయు పుట్టుటచే, దానికిని మన తెనుఁగువాఁతకును పొత్తు కానవచ్చు చున్నది. ఇప్పటి తెనుఁగువాలు గుండ్రపాఱినవి. చేయి బాగుగా నలఁగినవారు తాటాకుల మీఁదఁ గాని కాగితముల మీఁదఁ గాని పట్టి వ్రాసిన తెనుఁగు వాలు ముత్యాల కోవలవలె ముద్దులు మూటఁ గట్టుచుండును. కాని, ఇపు డట్లు వాయఁగలవారు ఎక్కడనో కాని కానరారు. మనవాఁత చక్కఁ బఱుచుకొనుటకు ఇపుడేని మనము కడంగఁదగదా?
కొన్ని ప్రాంతపొత్తములు
ఇప్పటికి వ్రాఁతమనుగడను గూర్చి కొంత తెలిసికొంటిమి. ఇంక , పొత్తపుగుడులకు ప్రాపులగు ప్రాంతపొత్తములను గూర్చి కొంత తెలిసికొననగు.
"జ౯" పొత్తము - ఇది టూకీజగము మనుగడ అని ఒకరితలంపు; సృష్టి సూత్రగ్రంధమని ఒరుల తలంపు; ఎప్పటిదో సరిగా తెలియదు; ఇందు కొంత ఈజగము పుట్టకముందే ఉండెనని కొందఱు తలంచుచున్నారు. దీని చెడని పొరటలు ఎట్టివో ఎవరును చెప్పఁజాలరని ఒకరి తలంపు; అని ఎప్పుడును చెడని తెఱంగున తయారుచేసిన తాటాకులని ఒరులు తలంపు. అంతేకాదు, వానిలో గొప్ప మహిమ కలదఁట! ఎవరేని ఒక ఆకు చేతితో పట్టుకొన్న వెంటనే దానిలోని విషయములు కంటఁ గట్టినట్లు అగపడుటయే కాక, అప్పుడే ఆపట్టుకొన్న వారి భాషలో వీలగునంత తేట తెల్లముగా చెప్పి నట్లు వినవచ్చునఁట! అసలుపొత్తము గుట్టుచదువు జట్టుపెద్దదగ్గ ఉన్నదఁట! అది ఎవరును పైవారు చూడలేదఁట!
“దాని నకలోకటి తోఁబుట్టు జట్టువారి మ్యూజియములో ఉన్నది; ఈ నేలమీఁది మిక్కిలి ప్రాంత పొత్త మదేకావచ్చును; అదే బ్లావట్ స్కీ అమ్మయు ఆమె శిష్యులు పెక్కురును చూచినారు" అని బెసంటమ్మయు, లెడ్ బీటర్ యోగియు తెలిపియున్నారు.
దీనిలోని కొంతభాగమునకు బ్లావట్ స్కీ అమ్మ చేసిన వ్యాఖ్యానమే “సీక్రెట్" డాక్ ట్రి౯ "- గుప్త విద్య అను మేటిపొత్తము; ఇంగ్లీషు వచ్చిన వారందఱును చదువఁదగినది; పెక్కు వేల పొత్తముల నిగ్గు దీనిలో కలదని ఆమె వ్రాసిన మాట ముమ్మాటికి నిజము; ఇది చదువుటవలన మనయెఱుక ఎంతయు హెచ్చునని చెప్పఁగలను.