Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాక —ఇండియా పొత్తపు గుడికడంక కెల్ల మేటి ప్రొపై కీ. శే. నూరి నరసింహశాస్త్రిగారి తోడ్పాటుతో తొలుత ఎంతో పాటుపడి, పిదప ఎక్కటిబంటుగా సైతము డబ్బును - ఉసుఱును ధారపోసి, ఇపుడుకొంతవిశ్రాంతి కొనుచున్న శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారికి తమకడంక నెగ్గించుటకు వలయు ఆయురారోగ్య వైభవములు సమకూర్ప ఎల్లఱేని ఎల్లయెడల వేఁడెద. ఆం. దే. గ్రం. సం. కార్య నిర్వాహకులను గూర్చియు, గ్రంధాలయ నిర్వాహకులనుగూర్చియు, అటులే వేఁడెద.

తెనుగుఁతోడి పొత్తు

పొత్తపుగుడికడంకకు నాటి పలుకుతోడిపొత్తు హెచ్చుగా కావలె. ఏనాటివారికి ఆనాటిపలుకులో వ్రాసిన పొత్తములవలనే ఎఱుక కలిగించి, హాయిపొందువెరవు చూపవలె. కానీ, తెనుఁగు నాట గ్రంథాలయోద్యమము ఫలవంతనుగుటకు తెనుఁగుతోడ్పాటు కావలె. కావున, మన పలుకు తల్లిని మనమందఱమును మన్నించి, మంచిస్థితిలోనికి తెచ్చుటకు ప్రయత్నింపవలె. తెనుఁగు వ్రాగమికిలోటు లేనిదను పేరుతేవలె. తెనుఁగుతల్లిని తక్కిన మేటిపలుకులతో పాటు గద్దె ఎక్కింపవలె. వలయు పొత్తములన్నియు తెనుఁగులో వ్రాయవలె; వ్రాయింపవలె; అందు తెనుఁగుతనమునకు పెద్దరిక మీయవలె - ఆసఁగా తప్పనిసరిగా కావలసినపుడే పెఱపలుకులనుడులు వాడవలెఁగాని, అక్కఱలేని చోట్ల కూడ అవి వాడ రాదు. అప్పుడే తెనుఁగుసరిగా తెనుఁగనిపించుకొనఁ దగియుండును. సంస్కృతము, ఇంగ్లీషు మొదలగు అక్కఱమాలిన నుడులతో నిండిన పొత్తములలోని తెనుఁగు తెనుఁగనిపించు కొనదగుదు.

పొత్తపుగుడినుడులు

ఎఉద్యమమేని బాగుగా పనిచేయునపుడు దాని వ్రాఁమియూ బాగుగా పెరుఁగును. అందు కొత్త మడులు వచ్చును. మన పొత్తపుగుడికడంక అట్టిదే. దీనిలో కొంతవిడి వీరగామి ఏర్పడినది. అందు ఎవరికి తట్టిన నుడులు వారువాడినారు. వానిలో కొన్ని నిలిచియున్నవి, కొన్ని పోయినవి. నేను పొత్తపుగుడి కొలువరినైనను, అంతకంటే హెచ్చుగా తెనుఁగుపలకు తల్లికొలువరిని. కానా నామడివికలో నాకట్టడకుబట్టి, సంస్కృతపు నుడులకుమాఱు నాటినుడులకు కొంతవఱకు పెద్దఱిక మిచ్చెదను. ఇంతకుముందు ఎవరును ఇటు చేయకపోవుటచే ఇదిమీకు క్రొత్తగా నుండును. అందులకు తెనుఁగు పెంపు కోరవలసిన మీరు నన్ను మన్నింతురుగాక! మచ్చుగా నేను వాడిననాటి నుడులు కొన్ని తెలిపెద - పొత్తపుగుడి = గ్రంధాలయము; పేరోలగము = మహాసభ; కడంక = ఉద్యమము; నుడివిక = ఉపన్యాసము; మనుగడ = చరిత్ర; పలుకు = భాష; కొలువరి = సేవకుఁడు; తెల = విషయము; మేలెఱుక = దివ్యజ్ఞాసము; వ్రాగమి = వాఙ్మయము; గుట్టుచదువు = గుప్తవిద్య.

వ్రాఁతమనుగడ

పొత్త పుగుడులకు పొత్తములతో పొత్తు తప్పదు. పొత్తములకు వ్రాతతో పొత్తు తప్పదు. కాని, దానీ మనుగడ యిప్పటికిని సరిగా తెలియరాకున్నది. ఇప్పటి తూర్పుపడమర నెఱువాదులలో పెక్కు రువ్రాసిన వ్రాఁతలంబట్టి, వ్రాఁత ఏడెనిమిదివేల యేండ్లనుండియే వాడుకలోనికి వచ్చినట్లు కాన వచ్చును. కాని, సరిగా పరికించి చూచుచో, వ్రాఁత చిరకాలము క్రిందటనే ఉండినట్లు తేటపడును. అంతేకాదు; అది మానిసితోడనే పుట్టినట్లు “నుదుట౯ వ్రాసిన వ్రాఁతకన్నఁగలదా నూరేండ్లు చింతించిన౯" అనుమాటయే చాటుచున్నది. నుదుటి వ్రాఁత బ్రహ్మలిపి; అది మనకు తెలియదుకదా! అని ఎవరేని అనవచ్చును. కానీ మనకు తెలియదను కారణముచేత మాత్రము, అది వ్రాఁత కాకపోదు.అదే అన నేల? మనలో మిక్కిలి తెలివిగలవారికికూడ తెలియని వ్రాఁతలు పెక్కులుకలవు,