Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయ సంఘమునకు అధ్యక్షుఁడనుగాను ఉన్నాను. కాన, నా కొలువును గూర్చి తెలిసిన నాతోడి పొత్తపుగుడి కొలువరులు నాకుఈ మన్నన ఇపుడు చేసినారనుకొందును. ఇందువలన మన్నన తెచ్చునది కొలువే అని గుర్తింపనగును. కానీ, మీరు నాకిచ్చిన యీ పెద్దఱికపు కొలువు మీ తోడ్పాటుతోడ నే కానీ సరిగా కానేరదు. కావున, మీలో ఒకఁడనగు నాకు తోడ్పడి, జరుగవలసిన పని చక్కఁగా జరిపించెదరుగాక ! అని మిమ్మందఱను వేఁడుకొ నెదను. నా నుడినిక మొదలిడుటకు ముందు మిమ్ము మఱొక కోరిక కోరుకోనెదను.

"ఏ నెఱుంగ దీనిఁ; ఇది అందుచేఁకల్ల, అనెడుమాటలెపుడుఁ అనకుఁడీరు;
 ఎఱుఁగఁ చదువవలయు; ఎఱుఁగవలెగ్రహింప; నిగ్గుతేల్చుకొనఁగ నేర్వవలయు"

ఇది నారదమహర్షి భావము. దీనిని బ్లావట్ నీౄ అమ్మగారు 'దివీల్ అఫ్ ఇసిస్' అనుపొత్తముతుదిని చేర్చరి. అదే 'నేనిపుడు విన్నవించితిని. మనకు తేలిసినది మిక్కిలితక్కువ; తెలియనిది మిక్కిలి యెక్కువ. కానీ, తెలియనిది తెలిసికొనుటకు ఎన్నో పొత్తములు చదువవలె; కాని, అవి అన్నియు మనకు దొరకవు; దొరకినవి చదివినను చదివినదైన ఆకళింపునకు తెచ్చుకొనఁగలిగియుండవలె; అందలి నిగ్గు తేల్చుకొనఁ గలిగియుండవలె. ఆపుడుగాని కొంతయేని మనకు తెలియదు. అట్టిచో, ఉన్న పొత్తములుకూడ చదువకయే, అని చదివినవారివలన తెలిసికొనకయే, ఏదీకాని కల్లఅనరాదు.

ఎఱుక మనకు ఎట్లు కలుగును?

౧ గురువులవలన; ౨ స్వయంకృషివలస, 3 అనుభవమువలను నోటితో చెప్పినవారేకాక, ఎఱుక కలిగించు పొత్తములు వ్రాసినవారును మనగురువులే. దేశాటనము, పరిశోధనము మొదలగునవిపైవానిలో నే చేరును. అనుభవములో, అధ్యాత్మికానుభవము మిక్కిలి గొప్పది; అదే నిక్కపుఱుకపట్టు. నిజమునకు తక్కినవన్నియు దానికి మెట్లే. ఎఱుక్యడింపఁదలఁచువారు గురువుల కొఱకు అరయుదురు; కాని, తగినవారు దొరకుట అరిది. దేశాటనముగాని, పరిశోధనముగాని, అందఱును చేయఁజూలరు. ఆధ్యాత్మికానుభవము కోటిలో ఒక్కరికేని కలుగునో! కలుగదో! కాన స్వయంకృషివలన సులువుగా అందఱకును ఎఱుకకలిగించు వెరవులు పొత్తపుగుడులే. పలుపలుకులేల? ఎఱుకయే ఎన్న రానిపస; ఎఱుకయే ఎల్లప్పుడునుండు కలిమి; ఎఱుకయే ఎడతెగనిహాయి. అట్టి అప్పసపు టెఱుక సమకూర్చిడి యీవి మ్రాఁకులు పొత్తపుగుతులుగాక మఱిఏవి?

శ్రుతి, స్మృతి, సిద్ధులదివ్యదృష్టి, సజ్జనుల సత్ప్రవర్తనము - అను నాలుగు ఎఱుకదొనలని మనువనె.

ఎఱుకకలిగించుటలో సులువగు మేటి వెరపులు పొత్తపుగుడులె అయినపుడు వానినిగూర్చి బాగుగా ఎఱుంగనగు.

పొత్తపుగుడి కడంక

ఇది క్రొత్తది కాదు; ఎప్పుడో పుట్టినది; పెరిఁగినది; నడుమతగ్గినది; మరల తలయెత్తినది; ఇపుడు పడమటినాడులలో బాగుగా సాగుచున్నది; ఇండియాలో బరోడా సంస్థానమున ప్రశస్తముగా జరుగు చున్నది; మన తెనుఁగునాటను కొంతవఱకు పని చేయుచు, కొంత మేలు చేకూర్చుచున్నది. అయినను, ఇంకను మన పెద్దలు పలువురు దీనికి వలయుసాయమీయకున్నారు; దొరతనము వారి తోడ్పాటును కడు తక్కువగా ఉన్నది. అందువలన మన పొత్తపుగుడికడంక రావలసినంత 'పైమెట్టునకు రాఁజలకున్నది. చేయవలసినంత మేలు చేయఁజాలకున్నది. ఇట్టిచో, ఈపాటి నుంచి ఉనికిలోని కేని తెచ్చి, దానిని నిలువఁబెట్టుచున్న నాతోడి పొత్తపుగుడి కొలువరుల కెల్లరకును ఈ పేరోలగమున ఉన్న మీకును, ఇక్క_డకురాజాలని వారికినిగూడ- జేజేలుచేసెద. అందు, మంది మేలుకోరి, తెనుఁగునాటి పేరు కోరి - తమకును పేరుతెచ్చుకొనకోరిన కోరియుందురుగాక! తెనుఁగువాటి పొత్తపుగుడికడంక కే