గ్రంథాలయ సేవకుల స్మృతిపధములో నాబోటివాళ్లుండుటకు తావులేదు. ఇది పూర్వగాథ.
దేశములో ప్రచురితములగుచున్న మత సాంఘిక రాజకీయాది వివిధ ఉద్యమము లకును గ్రంధాలయోద్యమము జీవము వంటిదని యంగీకరింపక తప్పదు. గ్రంథాలయముల మూలముననే దేశమునందుత్పన్నములయ్యే యుద్యమములన్నింటిని సజీవములుగా, ప్రతిభావంతములుగా, స్థిరములుగా నుంచుట కెంతయో యవకాశము కలదు. దీనికొక యుదాహరణము చూపవచ్చును. భీమవరముతాలూకాలో నేమి, మరి యితర ప్రదేశములలో నేమి యేగ్రంధాలయము లెక్కువగా సేవచేయు చున్నవో ఆయా ప్రదేశములలోని ప్రజలు రాజకీయోద్యమములో ముందంజ వైచుటయేగాక విద్యావిజ్ఞానములయం దంతయో యున్నతస్థితికి వచ్చియున్నారని చెప్పవచ్చును. ప్రజలలో వయోజనవిద్యావ్యాపనమునకుగాని, బాలవిజ్ఞానవ్యాపనమునకుగాని గ్రంధాలయముల ద్వారా మనము విద్యాలయములకంటెను బాహుశ్యముగా విజ్ఞానవ్యాపకము చేయగలమను నమ్మకము నాకు గలదు. కనేక విధముల మహోపకారము చేయగల యీ గ్రంథాలయస్థాపనముపట్ల ధనవంతులలో మనమిత్రుడు కృష్ణ రాయనివంటి కొలదిమందిలో తప్ప తక్కినవా రెవ్వరును యీ యుద్యమమునకు తోడ్పడకపోవుట విచారకరము. ప్రతిగ్రామములోను దేవాలయము, విద్యాలయము ఎంత ప్రధానములో గ్రంథాలయములుకూడ అంతటి ముఖ్య సంస్థ లేయని యిప్పటికైనను గుర్తించి ప్రతి గ్రామమందును గ్రంథాలయ ముల నెలకొల్పి వాటియభివృద్ధికి పాటుపడవలసియున్నారము. పల్లెగ్రామములలో ఎవరంతటవారు చందాల పూర్వకముగా డబ్బిచ్చి పోషింపలేకపోయినను కొలగారపుపాటలు, పచ్చగడ్డి అమ్మకము పాటలు మొదలగువాటిద్వారా వచ్చు ఊరిఉమ్మడి సొమ్ములో కొంతభాగమును యీ గ్రంథాలయముల నెలకొల్పుటకు మనము గ్రామీయులను ప్రోత్సహింపవలసియున్నది. గ్రంథాలయములు నెలకొల్పబడి బాగుగా పనిచేయుచున్న గ్రామాదులలో జాతి కుల మత భేదము లంతగా పాటింపక ఆ సరస్వతీ నిలయమునం దేక మనస్కులై యన్యోన్యముగా కలిసి పని చేయుచుండుట మన మెరుగుదుము. గ్రామపంచాయితీలున్న ప్రదేశములలో తప్పక ఆ పంచాయతీ యాజమాన్యమున నొక్కొక్క గ్రంథాలయమును నెలకొల్పిదానిని పోషించవలసిన యావశ్యక మెంతయేని కలదు. జిల్లాబోర్డు పరిపాలనము క్రింద కొన్ని పుస్తక భాండాగారములు స్థాపింపబడి పనిచేయుచున్నను బోర్డువారు గ్రంథాలయముల కివ్వవలసినంత సహాయప్రోత్సాహముల కలిగింపకుండుట విచారకరము. ప్రాథమిక విద్యావ్యాప్తి ఎంత ముఖ్యావసరమో గ్రంథాలయములను విరివిగా నెలకొల్పి తన్మూలమున విద్యావ్యాపక మభివృద్ధిచేయుట తమ కనీసధర్మమని