౨౨న ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభ
రాజమహేంద్ర వరము
ప్రారంభోపన్యాసము
గ్రంధాలయ సేవకమహాశయులారా !
నేటి యీ గ్రంథాలయ మహాసభకు నన్ను సభాప్రారంభకునిగా నాజ్ఞాపించిన ఆహ్వాన సంఘము వారి సాహసమెంతయు కొనియాడదగియున్నది. ప్రధమమున ఈపనికి నియోగింపబడిన శ్రీ అబ్బూరి రామకృష్ణరావుగారు ఆంధ్రసారస్వతాకాశమండలమున విజ్ఞానకాంతిని వెదజల్లుచున్న సుప్రసిద్ధ కవితారాగణము లలో నొకరు; ఆంగ్లేయ విద్యాధికులు. అట్టివారిచే ప్రారంభింపబడవలసిన ఈ మహాసభను నాబోటి అనామకుడు ప్రారంభించుట నాటకములలో ఎవనిచేతనో రాజుపాత్ర ధరింపజేయునట్లుగా నున్నది. అయినప్పటికిని మీకంటే ఎక్కువసాహసము జూపి ఇందుల కంగీకరించినందులకు మీమన్ననకు పాత్రుడననే భావింపవలసి వచ్చుచున్నది.
ఈ గ్రంథాలయోద్యమము మన ఆంధ్రదేశమున నుద్భవించిన ప్రారంభదినము లలో అనగా నిప్పటికి ముప్పది సంవత్సరములకు పూర్వము నా స్వగ్రామమగు నిడదవోలులో ఒక గ్రంథాలయమును (ఇప్పటి చంద్రారెడ్డి గ్రంధనిలయమును) స్థాపించియుండుటవల్లను, ఆరోజులలో పల్లె గ్రామములలో గ్రంథాలయములు నెల కొల్పుటకు ప్రోత్సహించుచు, ఆరోజులలో జరుగుచు వచ్చిన గ్రంథాలయ సభలలో చురుకుగా పాల్గొనుచుండుట వల్లను, నేడు ఆంధ్రదేశమునందలి గ్రంథాలయపకులలోను సేవకులలోను అగ్రగణ్యుడుగా ప్రఖ్యాతివహించిన ఏప్రియమిత్రుని షష్టిపూర్తి మహోత్సవము చేయుచున్నామో ఆ యు తమపురుషుడగు శ్రీ నాళం కృష్ణరావు గారిచే నెలకొల్పబడిన శ్రీ వీరేశలింగం పుస్తకభాండాగారమునందు కొంతకాలము లైబ్రేరియను పని చేసియుండుటవల్లను ఈయుద్యమములో అప్పటి నుండి యిప్పటివరకునూ నడుముకట్టుకొని పనిచేయుచున్న నన్నెరిగినమిత్రులు కొందరుండుటవల్లను యీపనికి నన్ను నియోగించిరని యూహించుచున్నాను. మేమీ గ్రంథాలయోద్యమములో పనిచేయ మొదలు పెట్టిన నాటికి ఇప్పుడు చురుకుగా పనిచేయుచున్న గ్రంథాలయ సేవకులు పుట్టియుండక పోవుట చేతను, వీరు ఉత్సాహముతో పని ప్రారంభించునప్పటికి మేము కార్యరంగములో నుండి నిష్క్రమించి కారణాంతరములచే కాలు కదప వీలు లేక పోవుట చేతను ప్రస్తుత యువకులగు