లను, తాళపత్రగ్రంధములను కడుభద్రముగ జాగ్రత్తపరచి గ్రంథభాండాగారి వాటిని అర్హులగువారికేయిచ్చి పుచ్చుకొనుచుండవలెను. చిన్నవారలకొర కుపయోగింపబడు పుస్తకములను తప్పకకొనవలెను. వారే గ్రంధాలయమున కర్హులైన శిష్యులు. వారివల్ల గృహములభివృద్ధిపొంది దేశక్షేమము కలుగును. ఒక్కొక్క గ్రంథాలయములో నొక్కొకవిధమగు జ్ఞానమునిచ్చెడు పుస్తకములు చాల యుండవలెను.
పూర్వగ్రంధములను ఆధునిక గ్రంధములను చదివి వాటి మూలాధారముల తెలిసికొనుట గ్రంథాలయ సమితి సభ్యులకంటే గ్రంథభాండాగారి ముఖ్యవిధి. సంఘముయొక్క గుణములను బట్టియు, విద్యావిషయమును బట్టియు, నివాసుల వృత్తులబట్టియు గ్రంథాలయము యొక్క పలుకుబడి యుండును. గ్రంథాలయమును ఆదర్శముగ నడుపుటకును, చదువరుల కుపయోగపడు వంశములు తలపునకు వచ్చినపుడు చెప్పుటకును గ్రంధభాండాగారి సందేహపడకూడదు. గ్రంధవిమర్శ చేయుచు చదువరులకు కావలసిన విషయములు తెలియచేయవలెను. గ్రంథాలయములోని కార్యమునంతయు శ్రద్ధతో నిర్వహించవలెను.
పాలకవర్గము
గ్రంథాలయ పాలకులు అహంభావమును, మనస్పర్ధలను విడనాడి గ్రంథాలయముద్వారా విజ్ఞానము వెదజల్లు సదుద్దేశముతో శ్రద్ధగా పనిచేసిన యెడల త్వరలో గ్రంధాలయము అభివృద్ధిలోనికివచ్చి ఆదర్శముగ వెలయగలదు. 'నువ్వు దగ్గు, నేను పక్క లెగుర వేయుదును' అను న్యాయానుసారము పనిఅంతయు ఒకనిసేత్తినిరుద్ది వీరు తాత్కాలికముగ హోదాలు చెలాయించుటకు వచ్చుచుండిన ఫలితముకూడ అటులేయుండును.
అనుకూలమగుదినములను నిర్ణయించి నెలకు 4 దినములు గ్రంథాలయమునకు సెలవులుయిచ్చి ఆ సెలవుదినములలో వరుసగా తొలిదినమున గ్రంథాలయము పరిశీలించుటయు, మలిదినమున కొత్తచందాదార్లను చేర్చుటకు గ్రామమందు సంచారము చేయుటయు, మూడవదినమున బకాయి చందాదార్లను కలిసికొని సొమ్ము వసూలు చేయుటయు, నాల్గవదినమున కాలాతిక్రమణముపొందిన పుస్తకములు వసూలు చేయుటయు జరిగించవలెను.
పురాణపఠనముద్వారాను, ఉపన్యాసములు మూలమునను, ఆదర్శ పురుషులు జయంత్యుత్సవములు జరుపుటవలనను, పోటీపరీక్షలు జరిపించుట వలనను, మ్యాజిక్ లాంతరు ప్రదర్శనమువలనను, రాత్రి పాఠశాలలు నెలకొల్పుటవలనను వయోజనులను, బాలురను విజ్ఞానవంతులుగ చేయవలెను. గృహపరిశ్రమలకు సంబంధించిన ప్రదర్శనముల జరిపించి స్త్రీలోకమునకు విజ్ఞానమును వెదచల్లవలెను. నవరాత్రములందు సంగీతకచేరీలు మున్నగువాని నేర్పరచి ప్రజల నాకర్షించవలెను.