కలుగనంతవరకు గ్రంథాలయాభివృద్ధికి అనువగు మార్గముల అమలు పరచుటకు తగువ్యవహారజ్ఞానము గ్రంధభాండాగారి కలిగి యుండవలెను. భిన్నభిన్న ప్రవృత్తులుగల వ్యక్తులు అనేకమంది గ్రంథాలయమునకు వచ్చుచుందురుగాన వారిలో తన ప్రవృత్తికి విరుద్ధముగ నున్న వారిని నిర్లక్ష్యము చేయక ఆదరించి వారు కోరుగ్రంథముల నిచ్చుచు వారితో పరిచయము కలిగించుకొని వారిని సత్ప్రవర్తకులుగా దిద్దుబాటు చేయవలెను. అట్లని వారితో కాలము గడుపుచు తనవిధ్యుక్తధర్మమును మరువరాదు.
గ్రంథాలయమునకు వచ్చువారిని ఆకర్షించి జ్ఞానవంతులుగ చేయునట్టి చిత్రముల తోను సూక్తులతోను గ్రంథాలయమును అలంకరించవలెను. హెచ్చుమంది గ్రంధాలయమునకు వచ్చునటుల చేయుటయే గ్రంథ భాండాగారియొక్క ముఖ్యవిధి. గ్రంథా లయమునకు వచ్చినవారందరూ అచ్చట ఉన్నంతసేపు నిర్విచారముగ నుండునటుల చేయుటకు వారినాకర్షించు మంచి వార - మాస పత్రికలు తెప్పించుచుండవలెను. దేశపురోభివృద్ధికి ముఖ్యులగు పిల్లలను ఆకర్షించి బుద్ధిమంతులుగ చేయుకొరకు అందమగు పటములతోకూడిన చారిత్రక పుస్తకములను, కధల పుస్తకములను తెప్పించవలెను. గ్రంథాలయమందు ఇతర పుస్తకముకంటే విమర్శక గ్రంథములు హెచ్చుగా నుండవలెను. విమర్శనాదృష్టితో గ్రంధములు చదివినవారు చేయు సూచనలను రికార్డు చేయవలెను. గ్రంథ భాండాగారి తెలుసుకొన్న విషయములను గ్రంధాలయమునకు వచ్చువారికి తెలుపుచుండవలెను. ప్రతిమాసమందును గ్రంథాలయమందు చేర్చబడిన పుస్తకముల పట్టికను ప్రచురణ చేయుచుండవలెను. దీనిని నోటీసుబోర్డుకు అంటించవలెను. పుస్తకముల పేర్లనుబట్టియు, గ్రంధముల తరగతులనుబట్టియు విభజన చేసి వరుసగ వ్రాసి చదువరుల కొసంగు చుండవలెను. పత్రికలయందలి ముఖ్య విషయములను (సారాంశములను) నల్లబల్లపై వ్రాసి గ్రంధాలయముసకువచ్చువారికి కనబడునట్లు ఉంచవలెను. పారకులు గ్రంధములను భద్రముగ చదువునటుల ప్రోత్సహింపవలెను. ఉపయోగమున కనుకూలముగనుండు పద్ధతిని పుస్తకములు నేర్పాటు చేసి నెల కొకసారి పుస్తకముల నన్నిటిని పరిశీలించి క్రమ సంఖ్యప్రకారము సరిగావుంచుచు చెదలు మొదలగు పురుగుల వల్ల చెడకుండుటకు కర్పూరమాత్రలు మొదలగు రక్షణ ద్రవ్యములను గ్రంధపేటికలయందు జల్లుచుండలెను. తనతోడి సేవకులను హింసించక ఉత్సాహపరచి గ్రంధాలయాభివృద్ధికి పాటు పడునటుల చేసి వారితో తానుకూడ పనిచేయవలెను. | పాలక వర్గము వారికిని తనకును అభిప్రాయభేదములు కలిగినప్పటికిని స్పర్ధ వహించి గ్రంథాలయ పురోభివృద్ధికి భంగము కలిగించరాదు. భావికాలప్రవర్తన కుపయుక్తమగు గ్రంధములను, ఎంతధనము వెచ్చించినను దొరకని పుస్తకము