Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
“ఏమోనమ్మా ఆపద్యాలు నాకు తెలియవు. అవేంపద్యాలోగాని” అంది సూరి.
“సూరోయి, ఇదేం నాలుగోవాచకం" అంది సీతి.
“ఆసిదొంగా ఇంకా నీపు స్తకం అనుకుంటున్నాను” అంది సూరి.
“పోనీ నీపుస్తకంలో కథలు చదవవే" అంది సీతి.
"నాపుస్తకమూ అలాగేఉందమ్మా పాడు" అంది సూరి.
“ఒకటిచదవ్వే పోనీ” అంది సీతి.
“అయితే చదువుతా విను” అని సూరి ఇలా చదివింది.
“పూర్వ కాలంబున నుజ్జయిని నా బట్టణం బొండుకలదు .....”
"బొండు బొండు బొందేమిటే సూరీ” అంది సీతి.
“విన వే మరి” అని సూరిచదవడం సాగించినది.
“అందు వీరసేనుండను భూతలేంద్రుండు రాజ్యము సేయుచుండెను. అతనికి జంద్రకళయను పేరం బరగు కళత్రంబు సకలగుణోపేత...”
“పేత పేత మేతేమిటి పీత" అంది సీతి.
“పోనీ అమ్మా నేచదవను” అని సూరి పుస్తకము మూసేసింది.

నేను వ్రాసిన లక్కపిడతలలోంచి ఒక గేయం.

బాజాలురా నాన్న బాజాలు
బాజాలు వచ్చేయి బాజాలు
బాజాలతో వచ్చె పల్లకీ అదుగో
పల్లకీలో ఉంది పార్వతీదేవి
పార్వతీదేవికీ జేజేలు పెట్టు
బాజాలురా నాన్న బాజాలు
బాజాలు వచ్చేయి బాజాలు.

ఇంకా బాలవాఙ్మయాన్ని సృజించిన, సృజస్తున్న గ్రంధకర్తలు మనలో ఉన్నారు. గురజాడ అప్పారావుగారి ఆడపిల్లల పాట చిత్తగించండి:-

“ఆటల పాటల పేటికలారా
కమ్మనిమాటల కొమ్మల్లారా
కలువలకన్నెల కన్నెల్లారా
పిల్లలగన్న తల్లుల్లారా