Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ముగ్గురు తెలుగు పిల్లల బాల్యజీవనమును "సూరీ - సీతీ - వెంకీ " అనే పేరుతో కొన్నికధలుగా వ్రాశాను. ఒక కధాభాగం వినిపిస్తున్నాను.

“ముగ్గురూవెళ్ళి నడవలో కూర్చున్నారు. సూరి రెండోతరగతి వాచకము, సీతి ఒకటోతరగతి వాచకమూ, వెంకి పలకా పలకపుల్లా పట్టుకున్నారు.”

సూరి పుస్తకం జాగ్రత్తగా అట్ట వేసుకుంది. కొత్తబట్టలవిూది బొమ్మలు అట్టల విూద అంటించుకొంది. పుస్తకంలో ఒక నెమలికన్ను దానిదగ్గరే పువ్వారమూ పెట్టింది. "సీతోయి చూడవే చూడవే, ఈ నెమిలికన్నే ఎంతపువ్వారం తినే సిందో. ఒక పిల్లనైనా పెట్టదు - పాడు” అంది సూరి. సీతి తనపు స్తకంలో నెమిలి కన్నున్న పేజీతీసి “నాపువ్వారం కొంచెంతింది నా నెమిలికన్ను చూడే, అక్కా చూడే. ఎంత చిన్న పిల్లని పెట్టిందో! చూడే ఒసే" అంటూ సీతి ఒక చిన్న నెమిలి వెంట్రుక సూరికి చూపింది.

“అది పిల్లా ఏమిటమ్మా" అంది సూరి.
"కాదా ఏమిటమ్మా" అందిసీతి.

“నాకదియ్యవూ" అంది వెంకి. వెంకిని మభ్య పెట్టి సీతి కన్ను దాచేసుకుంది. సీతి పుస్తకము అంతా నలిగి చిరిగిఉంది.

“అక్కయ్యా ఈ పాఠం చెప్పవుటేనాకు” అంది సీతి.
“ఏం పాఠం" అని సూరి అడిగింది.
“కుక్క పాఠం” అంది సీతి.
“కుక్కపాఠ మేమిటి అసయ్యం. ఇంకా పాఠాల్లేవూ” అంది సూరి.
“పిల్లి పాఠం, ఏనుగ పాఠం, సోమరిపిల్లవాడి పాఠం ఉన్నాయి” అంది సీతి.
"అవేంపాఠాలే పాడుపాఠాలు. కధలు లేవూ” అని సూరి అడిగింది.
“నృగునికధ, హరిశ్చంద్రునికథ, ఎడ్వర్డుకధ, ఫ్రాంక్లినుకథ, ఈకధలున్నాయి” అంది సీతి.
"అ వేంకధలే, ఎంచక్కటి కథలేమీ లేవూ మనం చెప్పుకునీలాంటివి” అంది సూరి.
“ఏమోనమ్మా నాకు తెలియదు” అంది సీతి.
“పోనీ పద్యం చదువు” అంది సూరి.
“చివరున్నాయే పద్యాలు చదవనా ___
"క్షేత్రంబు పురుషకారము
ధాత్రీశ్వర బీజమరయ దైవమురెండున్
సూత్రపడ గూడెనేనియు ___"