Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


(2)⁠

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
మూలామంచం వేశారు
మూడుగుద్దులు గుద్దేరు
నులకామంచం వేశారు
నూరూ గుద్దులు గుద్దేరు.

⁠


(3)⁠

బుర్రుపెట్ట బుర్రుపెట్ట తుర్రుమన్నది
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపువ్వులు ముడువనన్నది
పడమటింటీ కాపురమ్మూ చేయనన్నది
మొగుడుకొడితే మొత్తుకుంది
బిడ్డపుడితే ఎత్తుకుంది.

⁠

కొన్నిపసిడితునకలు

ఇంతేకాకుండా ఈ బాలవాఙ్మయంలో ఏదేశపు సారస్వతానికైనా వన్నె దెచ్చే దివ్యకవిత్వపు పసిడితునకలు దొరుకుతవి. మచ్చుకు-

(1)⁠

ఆటమాణిక్యమే పాటమాణిక్యం
నట్టింట అమ్మాయి రత్నమాణిక్యం

⁠


(2)⁠

ఆడుకొని అబ్బాయి వచ్చెకాబోలు
అందెళ్ళ చప్పుళ్లు పందెళ్ళలోన
చదువుకొని అబ్బాయి వచ్చె కాబోలు
సరస్వతీచప్పుళ్లు సావిళ్ళలోన.

⁠


(3)⁠

అందరీమామల్లు మేనమామల్లు
అమ్మాయి మామల్లు చందమామల్లు.

⁠


(4)⁠

ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా
ఏడిస్తే నీకళ్లు నీలాలుగారు
నీలాలు కారితే నేచూడలేనూ
పాలయిన గారవే బంగారుకళ్లు.

⁠

మాతృప్రేమ నంతనూ కొద్దిమాటల్లో యిమడ్చడమే యీపాటలలోని ప్రతిభకు లక్షణం. ఇంకా ఈ పాటల్లో పరిశోధకులకు పనికివచ్చేటట్టులు అనేకం వున్నవి. ఈ పాటలూ కధలూ కొన్ని నన్నయ్యకుకూడా పూర్వమందు పుట్టి నేటివరకూ నిలిచి ఉన్నవి.