Jump to content

పుట:Andhra Granthalayam 1940 03,06 01 Volume No 01 Issue No 03,04 1.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
"రెండుకోట్ల డెబ్భైలక్షలమంది ఆంధ్రులను విద్యావంతులను చేయడానికి నామతము అంగీకరించేట్లయితే
ఒక మాసము రోజులలో సాధ్యమవుతుంది. ముందుగా వ్యావహారిక భాషలో మీ కర పత్రాల నన్నిటిని అచ్చొత్తించండి.
ఆ తరువాత తెలుగు అక్షరాలూ గుణింతము ప్రతి వారికీ నేర్పడానికి గ్రామాని కొక ప్రచారకుణ్ణి ఏర్పాటు చేయండి.
అక్షరాలూ గుణింతమూ మామూలు తెలివితేటలు గలవాడు నేర్చుకోడానికి వారము పదిరోజులకన్నా ఎక్కువ పట్టదు.
ఎప్పుడయితే అక్షరాలూ గుణింతమూ వచ్చిందో ఆ క్షణము నుంచీ మీ కరపత్రాలు మొదలయినవి చదువుకోగలుగుతాడు.
ఇంతకన్నా దేశములో విద్య వ్యాపింపచేయడానికి సులభమార్గము లేదు. మీరీ పనికి పూనుకోవలెను. ఈ విధముగా
బాల్కను రాష్ట్రాలలో యుద్ధము అయిపోయిన తర్వాత చేసినారు. నేను ఆ విషయమంతా చదివినాను. బాల్కను
రాష్ట్రాలలో ఆరుమాసాలలో విద్యా శూన్యత అంతా తోలిగిపోయింది."

గి. వెం. రామమూర్తి