గ్రంథాలయ నిబంధనలు*[1]
శ్రీ పాతూరి నాగభూషణం, డిప్.లిబ్.,
ఆంధ్ర దేశ గ్రంథాలయసంఘ కార్యదర్శి
"If rules are needed they should surely be addressed to those who manage the library. The public chiefly need not rules, but information and guidance, suggestion and advice. Stress should he laid upon the value the library offers and how to make the fullest use of it."
-B. M. HEADICAR
జనసామాన్యమందు విద్యాభిలాష, గ్రంథాలయావశ్యకతను గుర్తెరిగి తన్నిర్వహణకై అవసరమైన ధనమును ప్రేమతో నొసంగుట ఇవి గ్రంథాలయాభివృద్ధి కెంతయు సాయపడుననుట నిస్సంశయము. దీని కనుగుణముగ అభివృద్ధి కాటపట్టులుగనున్న అమెరికా, బ్రిటను మున్నగు పాశ్చాత్యదేశములందు గ్రంథాలయ చట్టము లేర్పడి అచ్చటి గ్రంథాలయముల అభివృద్ధికి చాల సహాయకారులుగనున్నవి. ఈ చట్టములు గ్రంధాలయస్థాపనకు పోషణకు నెంతదోహదములుగ నున్నవో, ఆయా దేశముల గ్రంథాలయోద్యమ చరిత్రల పఠించిన తెలియగలదు.
కాని గ్రంథాలయములు స్థాపింపబడినపిమ్మట నవి తమధర్మమును సరిగ్గా నిర్వహించవలెనన్న మరి కొన్ని యంశములును ముఖ్యములయియున్నవి. ఇందుకు చదువరులకు రుచించు వివిధవిషయములను గూర్చిన ముఖ్యగ్రంధములు, వానిని భద్రపరచుటకు యోగ్యములైన భవనములు, ప్రతిచదువరికి తగినపుస్తకమును ప్రతిపుస్తకమునకు తగినచదువరిని జాగ్రత్తగ సమకూర్చుచు, అందరికి తన గ్రంధాలయ మెట్లుపకరించునో యోచించి, అందు కనువగుపద్ధతులు నెప్పటికప్పుడాచరణలోనికి దెచ్చుటకై నిరంతరము ప్రయత్నించు గ్రంథాలయపాలకులు మిగుల అవసరములు. వీనికితోడు గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడునవి సక్రమమగు గ్రంథాలయనిబంధనలు, కఠినములు, అనవసరములు నగు నిబంధనలెంతగా గ్రంధాలయాభివృద్ధికి ఆటంకములుగనున్నవో నేటి మనదేశమందలి చాల గ్రంథాలయముల పరిస్థితులు ఋజువు చేయగలవు. చందాదారులకు తప్ప పుస్తకము లిండ్లకివ్వబడవను నొక్క చిన్న నిబంధన మన గ్రంథాలయములలోని పుస్తకముల నెట్లుపయోగమునకు రాకుండ
- ↑ 12-5-38 వ తేదీ వామనగుంటపాలెములో జరిగిన ఏడవ తెనాలి తాలూకా గ్రంధాలయ మహాసభయందీవ్యాసము చదువబడినది.