Jump to content

పుట:Andhra Granthalayam 1940 03,06 01 Volume No 01 Issue No 03,04 1.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంతులుగారు కర్మయోగి. భాషా ప్రపంచమున తన కర్తవ్యమును నెఱవేర్చి కృతకృత్యుడయినాడు. శబ్దబ్రహ్మమున లీనమయినాడు.

మహెూపాధ్యాయ బిరుదమునొసగి భారతీతీర్ధము తీర్థస్థానమయినది. కళాప్రపూర్ణ బిరుదము నర్పించి ఆంధ్రకళాపరిషత్తు తన కళాభిమానమును ప్రకటించుకొన్నది. రాయబహదూరు బిరుదముతో - కైజరు హిందీ బంగరు పతకముతో సర్కారువారు తమ గౌరవమును వెల్లడించినారు.

ఆంధ్రులు సమగ్రవ్యాకరణ నిర్మాణ దక్షుని జారవిడుచుకొన్నారు. సమగ్ర నిఘంటు రచనాచణుని ఉపయోగించుకొనలేకపోయినారు.

ఆయనకు స్మారక చిహ్నమునైన నేర్పఱచి తమ కృతజ్ఞతను వెల్లడించు కొందురా?

ఆయన ఆత్మకు పరమాత్ముడు శాశ్వతానందము నొసగునుగాక!