పుట:Andhra Granthalayam 1939 09 01 Volume No 01 Issue No 01.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

ఆంధ్రగ్రందాలయం

ఆంద్రోద్యమానికి పట్టుకొమ్మైనిలిచింది; గ్రంధాలయాలకు పంటభూమి అని చెప్పదగిన అమెరికాతో పోలిక తెచ్చుకొంది. ప్రజాదరణమీదే నిలిచి ప్రబంధంలో అన్ని దేశాలకు సవాలంటోంది!

గ్రందాలయసర్వస్వం

  ఆంధ్రగ్రంధాలయోద్యమవ్యాప్తికోసమే 1915వ సంవత్సరంలో 'గ్రంధాలయ సర్వస్వం' అనే త్రయి మాసిక పత్రిక నొకటిస్దాపించారు. 1918 వ సంవత్సర ములో మూడవ సంపుటమునుండి సంవత్సరమున కాఱుసంచికలవంతున ప్రకటింపబడినది. ఆంద్రదేశ గ్రంధాలయతత్వాన్ని భారతవర్షమున కంతకును చాటుటకై మూడవ సంపుటమందు ఆంగ్లేయభాగము ను కూడా చేర్చుటకై నిర్ణయించారు కాని మూడవ సంపుటమందలి సంపాదకీయములో ఆవిషయమేమీ గొచరింపలేదు; అట్టి ఆంగ్లభాగమును ప్రచురించునట్లు నాకెక్కడ కనపడనూలేదు. అక్కడక్కడి సంపాదకీయా లనుబట్టి చూస్తే గ్రంధాలయములు, గ్రందాలయాభిమానులు పత్రికకు తగిన ప్రొత్సాహ మివ్వకపోవటమే కారణమని తోస్తుంది. 1923 లో ఆరవసంపుటమునుండి 'గ్రంధాలయసర్వస్వము ' మాసపత్రికగా వెలువడింది. 
 గ్రంధాలయసర్వస్వం చేసిన సేవ కడు శ్లాఘనీయం; గ్రంధాలయశాస్త్రం ఆంధ్రవాజ్మయం, ఆంధ్రాభ్యుద యాని కనుకరించే యింకా అనేకవిషయాలను గురించి అనుభవజ్ఞులచే వ్రాయబడిన వ్యాసాలు ప్రకటించి  విజ్ఞానవ్యాప్తికి తోడ్పడింది; గ్రంధాలయాల సంఘాల నివేదికలు, వృత్తాంతములు ప్రకటించి గ్రంధాలయాలకు ఉత్తమగ్రంధములేర్చుకొనడానికి దారి చూపింది. గ్రందాలయ భవనములయొక్క. గ్రందాలయసేవకులయెక్క పటాలను, ఆంధ్రాభ్యుదయ బోధకములగు చిత్రములను ముద్రించి ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్టు చేసిరి.
 ఈ పత్రికను, ఆంధ్రగ్రంధాలయోద్యమాన్ని అల్లారు ముద్దుగా పొషించి పెంచిన శ్రీ అయ్యంకి వెంకటమణయ్యగారే 1938 వరకు అష్టకష్టాలు పడి బాలారిష్టాలు దాటించి నిర్వహించారు. ఏ సంవత్సరం  చూచినా పత్రికమీద నష్టమేకాని విలువ చిక్కలేదు. పత్రికలు తీసుకొనేవారు ఎక్కువ, చందాలిచ్చేవారు తక్కువ అయారు. వేడినీళ్ళ అనుపానంతో తీసికోమని మందిస్తే ఆ వేడినీళ్ళుకూడ నీసంచిలోనే ఉన్నాయేమొ చూడునాయనా అందట--ఒకముసలమ్మ, గ్రంధాలయసర్వస్వంగతి అలా దిగింది. ఏదొవిధంగా తంటాలుపడి పత్రిక ప్రచురిస్తే పంచేటందుకు పోస్టేజికూడా వెంకటరమణయ్యగారే భరించవలసివచ్చింది. ఈ చేతిచమురు భాగవతం ఎన్నాళ్ళు సాగుతుంది. పర్యవనానం పత్రికాపతనమే. పైకి లేవదీసే