పుట:AndhraRachaitaluVol1.djvu/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ర్వంకల వందులు వొగడగ
బింకముతో దాల్తువయ్య వేర్వెనకయ్యా!
తల్లిని పరిగొన భక్తుల
కుల్లాసము పుట్టజేసి యురు మదధారల్
వెల్లిగొన సొంపుసూసెడు
బల్లిదు నిను గొల్తునయ్య భవు వెనకయ్యా !

పాఠశాలలకు బనిచేయు విభ క్తిదీపిక, బాలచంధ్రోదయము, అలఘుకౌముది, వైకృతదీపిక మున్నగు చిన్న పుస్తకములుకూర్చిరి.

ఇవియెల్ల నటుండె, శబ్దరత్నాకరము తరువాత నాచార్యులవారికీర్తిని ధ్రువముచేయుగ్రంధము ప్రౌడవ్యాకరణము. నిఘంటురచనాకాలమున భారతాదిగ్రంధ పరిశోధనమువలన గలిగినఫలమే ప్రౌడవ్యాకరణము. సూరి బాలవ్యాకరణమునకు శేషగ్రంథమగుట దీనికి ద్రిలిబ్గలక్షణ శేషమని పేరుంచిరి.సూరివలె నాచార్యులుగారికి సూత్రపఱుచుటలో బొందిక కుదురలేదనవలయును. ఆచార్యులుగారు వ్రాసికొనినట్లు, ఇందలి లక్షణము లసాధారణములనియు నియ్యది విద్యార్థుల కత్యంతోపకారక మనియు ననుటలో సందేహములేదు.

క్షేత్రయ్య సీతారామాచార్యులుగారి దృష్టిలో బరమ ప్రామాణికుడు. క్షేత్రయపదములు వేశ్యలభినయించునపుడు వీరుచెవులు కోసికొనువారట. అభినయాభిరుచియాచార్యులుగారికి బెద్దదని పెద్దలవలన వినుట.

వీరు చెన్నపురిలోని బోధనాభ్యసన పాఠశాలలో ద్వితీయపండితులుగా 1864 లో మొట్టమొదట బ్రవేశించిరి. అక్కడినుండి రెండేండ్లకు ప్రథమపండితస్థాన మాక్రమించి యావబ్జవ మచటనే గడపి చెన్నపురిలో నాడుద్యోగించెడి కొక్కొండ వేంకటరత్నశర్మ, చదులువాడ సీతారామశాస్త్రి మున్నగువారితోపాటు సీతారామాచార్యులవారు నొక పండితస్థానము నాక్రమించిరి. శబ్దరత్నాకరము చదలువాడ సీతారామశాస్త్రిగారేసంధానింపగా, వారితరువాత సీతారామాచార్యులు తమపేర దాని నించించుకమార్పులుచేసి ప్రకటించుకొని రని నమ్మజాలని ప్రతీతి.