పుట:AndhraRachaitaluVol1.djvu/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ నా రచనలకై యెందరో మిత్రుల సహాయము పడసితిని. వారందరి మేలు మరచి పోజాలను. సామూహికముగా వారికి నా హార్థాభినందనము లిందు మూలముగా మనవి చేసికొనుచున్నాను.

ఒక సంగతి యేమనగా :- కవిబ్రహ్మ ఏటుకూరి వేంకట నరసయ్య గారు పూర్వము జనన్ము కలిగియుండినవా రనుకొని యిందు జేర్చుకొనుటకై, తెనాలి వాస్తవ్యులు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎం, ఏ; యల్, యల్, బి) గారిని కవిబ్రహ్మ జీవితాంశములు తెలుపవలసినదిగా గోరి తొందరపెట్టి యుంటిని. దయతో వారు పంపిన విషయములను జూచి నరసయ్యగారు 1911 సం|| జన్మించిరని తెలిసికొంటిని. వారు, మరికొందరు ప్రముఖ రచయితలు రెండవభాగమున రాగలవారు.

మరి, 1911 సం||తో ముగించుటకు బదులు, ఒకయేడు ముందుకు సాగి 1911 సం||లో జననము గల శ్రీతుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి నిందు జేర్చుట, వారిని గూర్చిన వ్రాయనము ద్వితీయ భాగమునకు ' నాంది ' పాఠము కాగలదని యిపు డిక్కడ మనాక్సూచనమునకు -

ఈ రచన యిటు లింతలో వెలుగు చూచుటకు పూజ్యులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ఆశీఃప్రోత్సాహములు నేనెపుడును మరవజాలని దోహదము లయినవి. వారికి మనఃపూర్వకమైన ధన్యవాదము లర్పించుచున్నాను.

ఈ గ్రంథము ' సరస్వతీ పవర్ ప్రెస్సు ' అధికారులు, ఉదారులు నగు శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావుగారి సౌహార్ధముతో నావిష్కృతమైనది. ప్రత్యేకశ్రద్ధవహించి, ముచ్చటగా నీకూర్పు ముద్రింపించి, ఇంతత్వరలో నా యుద్యమమును లోకమునకు జూపిన శ్రీ నాగేశ్వరరావుగారిని హృదయపుర్వకముగా నభినందించుచు, వారి కితోధిక భోగభాగ్య సంపత్తి ప్రసాదించుటకు జగదీశ్వరు నభ్యర్ధించుచున్నాను.

రాజమహేంద్రవరము

1 సెప్టెంబరు 1950

మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి