Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొట్రిలనేల? కేలగొని గోగులనొక్కుము నాథయంచు దా
గుట్రయొనర్చె లేమ తనగుబ్బలయుబ్బు సహింపలేమిచేన్.

ఇట్టి పరీక్షల కాగిన సుబ్రహ్మణ్యకవిని మాడుగల్లుఱేడు మెచ్చి యాస్థానకవిగా నర్థించెను. కాని జన్మస్థానమున కాయూరు దూరమగుటచే నంగీకరింపక కవిగారు వార్షికబహూకారము వచ్చునటుల ప్రార్థించెను. 1853 మొదలు 1869 వఱకు నాసంస్థాన వార్షికవిత్తము సుబ్రహ్మణ్యకవి పొందుచుండెను.

1869 లో పీఠికాపుర సంస్థానమున మాసవేతన మేర్పడినది. గంగాధరరామరాయేంద్రు డీకవిప్రతిభ దెలిసికొని సన్మానించెను. "భద్రాపరిణయము" అను ప్రౌఢాంధ్ర ప్రబంధ మా మహారాజున కంకితము గావించెను. ఏత త్కృతిప్రదానవిషయ మీ పద్యము తెలుపును.

శాలివాహనశక సంవత్సరము లిందు
          గగనకరీందుసంఖ్యల నెసంగ
జరుగు ప్రమాధివత్సర మార్గశిరశుద్ధ
          సప్తమీ శుక్రవాసరమునందు
శ్రీ మహారాజభూషిత చరిత్రుండు సూ
          ర్యారాయభూనాయకాత్మజుండు
రావు గంగాధరరామరాయక్షమా
          ధవుడు సుబ్రహ్మణ్య కవివరునకు

బీఠపురదుర్గ సౌధంపు బెద్దకొలువు
నందు భద్రాపరిణయ కావ్యంబు నంది
యధికతరమాన్యభూమి నెయ్యూఱులును సు
వర్ణ వలయంబులును సేలువలు నొసంగె.

ఈ భద్రాపరిణయము నాలుగాశ్వాసములు కలది. కాణాదము పెద్దన సోమయాజి భద్రాపరిణయమను మాఱు పేరుగల ముకుందవిలాస ప్రబంధము రచించెనని వీరేశలింగముపంతులు గారు వ్రాసిరి. ఆ ముకుంద