సంస్కృతమున అశ్వఘోష మహాకవి సౌందరనంద కావ్యము సంతరించెను. అందముగా నున్నదని యాగ్రంథనామము వీరు పెట్టుకొనిరి ఇతివృత్తములో దానితో గొంత పోలిక. ఇంతే. ఇంక మిగిలిన యావత్కవితాచమత్ర్కియము వీరిసొంతము. కథావస్తువు ధర్మనిష్ఠ కలయది. కవిత్వము తగినట్లు రసపుష్టమైనది. కావ్యము, రాశిలో వాసియైనది కాకపోవచ్చును, గుణసంపత్తిలో నుత్తమజాతికి జెందుచున్నది. ప్రాచీన సంప్రదాయములు తూలనాడక పోవుట - క్రొత్త దారులలోని మేలు నేరుకొనుట యీజంటకవులకు గల విశాలగుణము. అభ్యుదయపథములో సంగలు వేసికొనుచున్నార మన్నకొందఱు వీరి కవిత నేమందురు ! - కవిత నిత్యనవీనము కావలయును, అనగా పురాణము కావలయును. నేలవీడి సాముచేసిన వీలుకాదు. 'సౌందర నందము' పురాతనాధునాతన కవితలకు నేతుబంధము.
అలనాటినడిరేయి నశ్వరాజము వెన్ను
చమరి వీడ్కొని నట్టి స్థలము దాటి
చెన్నఱి దౌల దోచిన రాజగృహలక్ష్మి
వుల్కు వుల్కున దన్ను బోల్చికొనగ
నెలగోలు మూకల యెల్గుల సౌధ వా
తాయనమ్ము లసావృతములు గాగ
దలుపులు తెఱచి పౌరుల కిమితి బ్రువా
ణులగుచు వెఱగంది నిలిచి చూడ
నా త్తపరతత్త్వ బోధమౌ నాత్మతేజ
మాననేందుని పరివేషమై భజింప
బురము చొత్తెంచి నిలిచిన బోధి సత్వు
గనుకనిన్ గని పౌరులు గములు గూడి_
' ప్రథమవర్గము'
*