Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొంగ లెవ్వరైన దోతురు సుమ్ము ; ని

ద్రింప వలదు ప్రక్కయింటి వాడ !

ఇంత తియ్యనైన తెనుగు శయ్య ప్రాకృత పుణ్యవాసన కలిమి అనంత కృష్ణశర్మ గారి కందినది. ప్రమాణమునందు పయి పద్యములు పొట్టి వైనను, గుణమునందు గట్టివి. కట్టమంచికవి శర్మగారి సప్తశతీసారమునకు బ్రస్తావన సేయుచు నిటులనెను: "...ఈగాథసప్తశతి బౌద్ధయుగమునాటి యుత్కృష్ట జీవితమును దెలుపుచున్నది. భావములు కోమలములు. వానికి దీటైనది అనంతకృష్ణ శర్మగారి శైలి - మధురము, లలితము, రమణీయము.వీరి సరసత్వము అర్హతకొలది పొగడుట అసాధ్యము...............ఒక్కపద్యమే వ్రాయవలయును. అది మెఱుగు దీగవలెమనల గ్రమ్మియుండు నంధకారము నొక్కక్షణము పోద్రోలి నూతనలోకములు హఠాత్తుగ గోచరింప జేయవలయును. ఆలోకము, ఒక్కనిమిషము మాత్ర మెదుట నున్న నేమి? దాని రామణీయకము జీవము నంతయు నాక్రమించి చచ్చు వఱకును తదేక ధ్యానములో మునుగున ట్లొనరించును. అట్టిదియ కవిత. గుణము ప్రధానము. రాశికాదు ..."

శ్రీ రామలింగారెడ్డిగారికి, శర్మగారికి మంచి యనుబంధము. శర్మగారిని సరససాహిత్య ప్రచారమునకు బ్రేరేచినది 'కట్టమంచి' వారి సౌహార్దమేయట! సహజ ప్రతిభామనోజ్ఞత కలిగి కవితాగానము చేయుచున్న అనంత కృష్ణశర్మగారి శమీపూజ, పెనుగొండ పాట - మొదలైనవి తెలుగులో నిలిచి వెలుగొందు మెఱపులవంటి వని పెద్దల హృదయము. ఇది యిటుండ, రసికత్వ - కవిత్వములకు విజయపతాక నెత్తిన అనంతకృష్ణుని సంసార మాధురియు భావించుకోదగినది.

అనంతపుర మండములోని రాళ్ళపల్లి వీరియభిజనము. వీరి మాతామహులు అనంతాచార్యుల వారి కాయూరు వంశ పరంపరగా వచ్చిన శొత్రియ గ్రామము. పుంసంతానము లేమి నా యనంతా