పుట:AndhraRachaitaluVol1.djvu/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మల్లంపల్లి సోమశేఖర శర్మ

1891

జన్మస్థానము: మినుమించిలిపాడు అగ్రహారము. నివాసము ప్రకృతము మదరాసు. జననము: 1891 సం. రచనలు: 1. ఆంధ్రవీరులు 2. అమరావతీ స్తూపము. 3. చారిత్రక వ్యాసములు 4. ఆంధ్రదేశచరిత్ర సంగ్రహము 5. రోహిణీ చంద్రగుప్తము (నవల) ఎన్నో వ్యాసములు, శాసన పరిష్కారములు, పీఠికలు మొదలగునవి. ఆంగ్లగ్రంథములు: 1. Forgotten Chapter of Andhra country. 2. The History of the Reddy Kingdoms.


నేటిచరిత్రపరిశీలకులలో సోమశేఖరశర్మగారి స్థానము మహోత్తమమైనది. కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారి తరువాత బ్రామాణికత వీరిదేయని తెలుగువారికి జక్కని విశ్వాసము కలదు. లక్ష్మణరావుగారు, వీరభద్రరావుగారు తొలుత శర్మగారికి లక్ష్యభూతులు. విజ్ఞానసర్వస్వ రచనలో బెద్దకాలము లక్ష్మణరావుగారికి శర్మగారి సాహాయ్యసంపత్తి చేకూఱినది. నిశితమైన చూపు - నిర్మలమైన మనస్సు - సహజమైన కళారసికత - సందర్భ శుద్ధమయిన వాక్కు - నిక్కమయిన చరిత్రజిజ్ఞాస - నిరంతరాయమైన పరిశోధనము - ఇన్ని సుగుణములరాశి, శర్మగారనగా సాధారణుడుకాడు. శాసనపరిష్కారములో నేడున్నవారిలో వారినిదాటినవా రుండరు. లిపిశాస్త్ర మీయన చక్కగా నెఱుగును. శాసన దర్శనమునకు లిపిరహస్యజ్ఞత నుధాంజనము. ఆమేలి కాటుక శర్మగారి సొంతము. ఈయనసంగ్రహించి ప్రకటించిన శాసనము లిన్ని యన్ని యని యెన్నజాలము. ప్రాచీన దక్షిణహిందూదేశ చరిత్రము సర్వము శర్మగారికి గరబదరము. బౌద్ధయుగమును గూర్చిన వీరిపరిశీలనము గొప్పవిలువగలది. రెడ్డియుగమును గూర్చిన వీరి