పుట:AndhraRachaitaluVol1.djvu/468

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2. తుకాంబ 3. జపానుదేశ కవిత (తొలిసంజ- తెలిచాయలు) ఇత్యాదులు మొత్తము 11. నిఘంటువులు: 1. సంస్కృతాంధ్ర నిఘంటువు. 2. ఆచ్ఛికపద నిఘంటువు. 3. నన్నయ భారత పదకోశము. 4. తెలుగు సామెతలు (1,50,000 సామెతలు తెలుగుదేశములోనివి) ఇత్యాదులు 18.

WORKS IN ENGLISH

(1) Translations from Tikkana.(2) Translations from Potana.(3) The songs of Tyagaraja (4) The dance of the rain-drops (Modern Poetry) (5) A Survey of Telugu literature (6) Modern trends in telugu literature-


పయిని పేర్కొన బడిన గ్రంథములలో గొన్ని మాత్రము ముద్రితములు.


డాక్టరు చిలుకూరి నారాయణరావుగారి పేరు తెలియనివారుండరు. ఆయన ఎం.ఏ.పి.హెచ్, డి, ఎల్, టి. అనంతపురము 'ఆత్రేయాశ్రమము' వారి యునికి. కాని, ఆంధ్రభాషాచరిత్ర ప్రచారమునకు నారాయణరావుగారు యావదాంధ్రము సంచారము చేయుచుందురు. ఇప్పటి, వారి వయస్సు షష్టి. ఈముదిమిలో భావపుష్టి కలిమి దెలుగు దేశమే కాదు భారతభూమి సర్వము పర్యటింప గలుగుచున్నారు. ఈమానిసి భౌతికముగా ద్రఢిష్ఠుడుకాడు. 'దర్భపుల్ల' వలె సన్నమైన గాత్రము. ఒకకన్ను కొంచెముమెల్ల. మఱి, వ్యక్తిని జూడగా, నపాదలక్ష - పుటల పరిమితిగల వాజ్మయమును సృష్టించిన మహారచయిత యీయనయేనా, అని సంశయించుకొనునంతటి చిత్రము. ఈ నడుమనే కర్ణాటక దేశయాత్రలో ధార్వాడ, హుబ్బళ్ళి, బిజాపురము, బెళ్ళూరు మున్నుగా నెన్నో పట్టణముల సంచారము గావించి యాంధ్రవాజ్మయ ప్రశస్తి నుగ్గడించివచ్చినారు. దర్భంగ, వారణాసి మున్నుగానున్న