Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిలుకూరి నారాయణరావు

1890

జన్మస్థానము: విశాఖపట్టణ మండలములోని పొందూరు దగ్గరనున్న ఆనందపురము. ప్రకృతనివాసము: అనంతపురము. జననము: 1890 సం|| గ్రంథములు: మతము: 1. అధర్వవేదము (మూలము ప్రతిపదార్థము తాత్పర్యము) 2. ఋగ్వేదసాయన (భాష్యోపోద్ఘాతమునకు తెలుగు) 3. భగవద్గీత (ఆంధ్రవచనము) ఇత్యాదులు. స్మృతిగ్రంథములు: ఆపస్తంబ ధర్మసూత్రములు 2. గౌతమ ధర్మసూత్రములు (తెలుగు వచనము) ఇత్యాదులు. ఇతర మతగ్రంథములు: 1. త్రిపిటకములు 2. ధమ్మపదము 3. అశోకుని ధర్మశాసనములు (పాలిమూలము, సంస్కృతము తెలుగు) 4. గౌతమ బుద్ధుని జీవితము 5. జైనమతము 6. శైవసిద్ధాంతము 7. బసవేశ్వరుని చరిత్రము 8. అద్వైత సిద్ధాంతము 9. కురాను షరీఫు (ఇస్లామ మూలగ్రంథమునకు తెనుగు) 10. బైబులు (ప్రాత క్రొత్త నిబంధలకు తెలుగు) 11. సర్వమత సామరస్యము- సంస్కృత భాషాకృతులు: 1. సిద్ధాంతకౌముది (మూలము, తెనుగు వివరణము) 2. విక్రమాశ్వత్థామీయము- ఇత్యాదులు. శాస్త్రగ్రంథములు: 1. తర్క సంగ్రహము 2. శిశుమనశ్శాస్త్రము 3. ప్రసవశాస్త్రము ఇత్యాదులు 25 శాస్త్రగ్రంథములు. చరిత్రకృతులు: గోమను, గ్రీసు, రష్యా, చీనా, జపాను, బర్మా, ఆంధ్ర ఇత్యాది దేశ చరిత్రములు మొత్తము 20. జీవితచరిత్రములు: గాంధీ చరిత్ర, టాల్ స్టాయి చరిత్ర మున్నగునవి 8. భాషాశాస్త్రకృతులు: 1. ఆంధ్రభాషా చరిత్ర (2 భాగములు) ఇత్యాదులు మొత్తము 8. సంస్కృత ప్రాకృతాది వాజ్మయ చరిత్ర గ్రంథములు 14. భాషాస్వయం బోధినులు 15. విద్యావిధాన గ్రంథముల మొత్తము 10. ఆంధ్ర వాజ్మయ చరిత్రము (10 సంపుటములు) కవి జీవితగ్రంథములు మొత్తము 20. నాటకములు: 1. అంబ లేక మొండిశిఖండి 2. అశ్వత్థామ 3. అచ్చి లేక కాపువలపు 4. పెండ్లి 5. వాడే (పరిశోధకము) 6. నాటక నాటకము. (హాస్యము) 7. తిమ్మరుసు. 8. బొమ్మపొత్తికలు 9. మధురాంతకి ఇత్యాదులు మొత్తము 20. పద్యకావ్యములు: 1. రుబాయత్ ఉమర్ ఖయమ్‌,