పుట:AndhraRachaitaluVol1.djvu/461

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుడు ప్రభాకరశాస్త్రిగారికి నచ్చిన మహాకవి. ఆయనపద్యములలోని రహస్యపుమెలకువ లెన్నో యెన్నుకొని శాస్త్రిగారి శరీరము పులకితమగును. 'క్రీడాభిరామము' నకు సువిశాలమైన పీఠికవ్రాసి దానికి వెలుగుచూపిన మహాశయులు వీరు. "హరవిలాసము" వీరు సరిపఱుపగా నానందముద్రణాలయమువా రచ్చువేసిరి. వీరొకతీరునకు దెచ్చిన కాశీఖండము వావిళ్లవారు వెలువరించిరి. శ్రీనాథుని గ్రంధములలో నెన్నో పాఠములు ప్రభాకరశాస్త్రిగా రమూల్యపరిశోధనము గావించి యెత్తిచూపిరి.


ప్రబంధరత్నావళి - చాటుపద్యమణిమంజిరి - శాస్త్రిగారి పరిశోధనపు బంటలు. 'తంజావూరి యాంధ్రరాజులచరిత్ర' కు వీరురచించిన 'తొడిమ' గొప్పది. ఆంధ్రవిశ్వవకళాపరిషత్తు ప్రకటించిన 'రంగనాథ రామాయణము' నకు వీరిసహాయత పెద్దలు ప్రశంసించిరి. 'తెలుగు మెఱుగులు' అనుకూర్పులో జాలగ్రొత్త విషయములు మనము గ్రహింపగలుగుదుము. 'దేశికవిత' సేకరింపవలెనన్న యాశ వీరికి గొండంతయున్నది. ఇది యిటులుండగా, శాస్త్రిగారి యాధ్యాత్మికదృష్టి సాధారణుల కందరానిది. పరమేశ్వరప్రీత్యర్థమను సంకల్పముతో వీరు ప్రతికార్యము చేయుదురు. యోగనిష్టాగరిష్టత యున్నది. మానసిక శాంతి శారీరకస్వాస్థ్యము వీడినవారు వీరివాగమృతముచే సుపరితృప్తులగుచుండుట కనుచున్నాము. 'స్వయంతీర్ణ: పరాంస్తారయతి' ఈయాభాణకము శాస్త్రిగారి పట్ల వర్తించును. మానవసంఘము విజ్ఞానవిలసితము కావలయు ననగా ప్రభాకరశాస్త్రిగారి వంటి రచయితలే తెలుగునేల కవసరము. గాంధిమహాత్ముని పవిత్రాశయములు వేటూరివారి కొజ్జబంతులు. వీరి 'గాంధిరామాయణ' సంకలనవిషయము నిటీవల వినియుందురు. ఈశ్వర తత్త్వము గుర్తించిన మహాత్ముడు గాంధియేయని వారివిస్రంభము. ఎట్టి శక్తియున్నను, ఆకుమూల పిందివలె నడం