పుట:AndhraRachaitaluVol1.djvu/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేసినట్లే ప్రచురించెననియు జెప్పిరి. వీరు రచించిన యితర గ్రంథము లేవియు లేమింజేసియు, శైలి యన్నిభాగముల సదృశ మగుటంజేసియు నిందేది యెవరు రచించిరో తెలియుట దుస్సాధ్యము...."

ఏది యెటైన నీ గ్రంథ మొక్కటేతీరున ధారాళమైన కవిత్వముతో రాజిల్లినదనుట వాస్తవము. వేంకటేశ్వరకవి పితామహుడు ".....అజస్రాంభోరుహాప్తాను కం, పాసంప్రాప్త సమస్తదేశ విలసద్భాషా కవిత్వాది, విద్యాసంపాదితతరత్న హేమ వసనక్ష్మారామ భూషాముఖ, శ్రీ సత్కారుడు" అయిన వేంకటేశ్వరకవి యని గ్రంథములో జెప్పికొనెను. ఇతని తండ్రి రాజాధిరాజ నభాంతరార్యలోక సంశ్లాఘ్య సకల కలాకలాపనిధి" యట. ఆయనపేరు కామకవిరాజు. తండ్రికడనే మన వేంకటేశ్వరకవి చదువులు సమస్తము చదివెనట. ఇతని పితృసోదరుడు కూడ నుభయభాషాకవిత్వ విశారదుడనియు, రాజానుగ్రహ పాత్రుడనియు గ్రంథాదినున్నది. మేనమామయు గొప్పభక్తుడు, నీతిశాస్త్రవేత్తగ జెప్పబడెను. ఈరీతిని దండ్రియు, బినతండ్రియు, బితామహుడు, మాతులుడు ప్రఖ్యాతు లైనటులును, మహారాజ సత్కారము లంది నటులును వేంకటేశ్వరకవి కృతిప్రారంభ పద్యములో ఘనముగ స్తుతించుకొనెను గాని, వారి వారి గ్రంథములుగాని, వారినిగురించిన కథలుగాని కనబడవు, వినబడవు.

ఈ రామచంద్రోపాఖ్యానము నందలి కవిత యందచందములు కలిగి ధారావిషయమున బూర్వకావ్యములతీరు స్మరింప జేయుచున్నది. ఎక్కుకపోయె, చేతును మున్నగు ప్రయోగములు కొన్ని వ్యాకరణము ననుసరించనివి కలవు. మొత్తముమీద ద్రాక్షాపాకము, నడుమ నడుమ నారికేళపాకముగ గవితసాగినది. మచ్చుపద్యములు:

చ. ఒక పలుగాకి కాకి యమితోన్మద మొప్ప ధరాకుమారికం
జికమన నొందజేయ రఘుశేఖరు డారసి దాని కాత్మలో