పుట:AndhraRachaitaluVol1.djvu/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఆంధ్ర భాషానుశాసనము' అనుపేరుగల వీరి వ్యాకరణగ్రంథమునకు గొప్పప్రతిష్ట వచ్చినది. ఈయనుశాసనమునకు శాస్త్రులుగారు పడిన పరిశ్రమ మనంతము. ఎన్నో ప్రాచీనాధునాతన గ్రంథములనుండి ప్రయోగములు సేకరించిరి. ఈకృషికి వ్యావహారిక పదశానకముగా నుండుటవలస గొందఱు గ్రాంథిక వాదవీరులు శాస్త్రులుగారిని మెచ్చరు. పోనీ, వారికి మెచ్చులక్కఱలేదు. తోచి గొప్పకృషి చేసినారు. ముందునాళ్ళు వారి శాసనము శిరసావహించగల వని నేడు సూచనలు కనబడు చున్నవి.


ఉత్తర రామచరిత్రాంధ్రీకరణము వీరిది చక్కగానున్నది. 'అద్వైతంసుఖదుఃఖయో' రిత్యాదిశ్లోకమునకు శాస్త్రులుగారి యనువాదపు బొందిక యెంత సుందరముగానున్నది!


సకలావస్థల నేది కష్ట సుఖముల్ సైరించునో యేకమై

వికలంబైన మనంబు నెందు గనునో విశ్రాంతి యెందొప్పు వా

ర్ధక మందుం దమి బెండ్లియాది మృతి పర్యంతంబుగా బ్రేమసా

ర్థకమౌ నెయ్యది నిత్యభద్రమయి యాదాంపత్య మేసారెడున్.

                 ________________