పుట:AndhraRachaitaluVol1.djvu/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బృందారకాపగా మందభా బృందాని
               కైలాస శైల రుగ్జాలకాని
మహనీయ సురమహీగుహ దీప్తిజాతాని
              విపుల శుభ్రచ్ఛదోస్రపటలాని
వ్యాళనాయక రుచి చక్రవాళకాని
క బు విస్ఫార శోభాకదంబకాని
భువి విజిత్వా విరేజిరే తవయశాంసి
మారమదభంగ! కుక్కుటాకారలింగ!

ఏతద్ గ్రంథాంతగద్యమున "ఇది శ్రీమ త్కుక్కుటేశానుగ్రహ ప్రభూతకవిత్వ విశ్వామిత్ర గోత్రపవిత్ర వారణాసివంశపారావార కైరవమిత్ర విద్వన్నుతచరిత్ర కామయార్య పుత్ర సుకవి జనవిధేయ శ్రీ వేంకటేశ్వర నామధేయ ప్రణీతంబైన...." యనియున్నదిగాని, కృత్యాది పద్యములో నీగ్రంథనిర్మాణమునకు దనసొదరులైన లక్ష్మీపతి, జోగన్న యనువారలు తోడైరని కలదు. ఆ పద్య మిది :

శా. ప్రీతింబుట్టితి మవ్వధూవరులకున్ శ్రీ వెంకటేశుండా నే
నేతద్ గ్రంథనిబంధనంబునకు నాకెంతోనియుం దోడుగా
జేతస్ఫూర్తి రచించి పొల్పసగు లక్ష్మీవత్సభిఖ్యుండు వి
ఖ్యాతప్రజ్ఞఉడు జోగనాహ్వయుడు నార్యశ్లాఘ్యసంశీలతన్.

గ్రంథపీఠికాకారులు మల్లయ్యశాస్త్రిగా రీవిషయము గురుతించి యిటులు వ్రాయుచున్నారు.

"...ఇట్లున్నను నీగ్రామమున నున్న వారొకరు వీరు తమకు సన్నిహిత బంధువు లనియు, వీరిమువ్వుర నెరుగుదు మనియు, వేంకటేశ్వరకవి దీనిని రచింపనారంభించి మిక్కిలి కొలదిభాగమును రచియించి యేకారణముచేతనో మాని తరువాత గొలదిదినములలో మృతిజెందెననియు, బిమ్మట లక్ష్మీపతియే దీనిని సాంతముచేసి యన్నయందలి భక్తిచే నాయన