పుట:AndhraRachaitaluVol1.djvu/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పద్యములో 'నవ్యసాహిత్య యోధసంతతుల నడిపె' "భాపుక పండితుండయ్యె శివుడు" అనుటలో నెంతో యంతరర్థ మున్నది. కవిగారి సాహిత్యదృష్టి కీ పద్య్ములు రెండును గన్నులు.


సప్తమాశ్వాసమున:--శివాజీపాదుషా కొలువునకు వెళ్ళినపుడు, వారియమర్యాదసహింపక-

"పాధుషా యొక్క డొకమాట పల్కకున్న

గొదువ మాకేమి? తన కేమిగొప్ప కలదు?

నమ్మికొలువున్న వారి మనంబులందు

మేలుకొనుగాక యిర్వుర మేలు కీడు."

అనెను. పాధుషా కోపించి యెవరత డనును. అప్పుడు రామసింగు పాధుషాతో నిట్లు చెప్ప్సను: అక్కడి పద్య మిది:


మ. అమృతప్రాయ దరీఝురీ విపిన సహ్య స్వైర సంచార ధీ

ర మహారాష్ట్ర మృగేంద్రు డీయవన సమ్రాడంచితాస్థాన దు

ర్దమ సమ్మర్ద నిదాఘ దాహులులిత ప్రత్యగ్ర ధూమాయితాం

గములన్ గర్జిల సాగె, శీతల కటాక్షం బిందు సారింపుడీ!


వీరరస స్ఫోరకమగు నిట్టి దీర్ఘ సమాసములు పొడులవలె నక్కడక్కడ బొదిగించిరి. తక్కినపట్టుల నెక్కడ జూచినను జాను తెనుగు నొడి కారమే గౌరవస్థానమున నున్నది.


తానాజీ సింహగడము మీదికి యుద్దయాత్రకట్టుట, కోట బ్రాకిలోనికి వెళ్ళుట, అక్కడ వెనుదీయక ఘోరముగా బోరుట మొదలగు ఘట్టములు చూచినచో దిక్కనసోమయాజి స్మరణమునకు రాక మానడు. 'శివభారతము' పేరుసార్థకముగ నెన్నోఘట్టము లుదాహరింప వచ్చును. తానాజీ నిర్యాణానంతరము తమ్ముడు సూర్యాజీ పోరుసలుపును. ఆ ఘట్టము మఱియు రమణీయతరము. తానాజీ మరణము