పుట:AndhraRachaitaluVol1.djvu/376

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణశర్మగారి హృదయ మిట్లున్నది: "......ఆధునికాంధ్ర సాహిత్యమందు నాకుగల యల్పానుభవములో మహాకావ్య మనుపేరున కింత తగిన గ్రంథమును నేజూడలేదు......ఈభారతము భాష గొప్ప వర్చస్సుతో ప్రసన్న మధురముగా ప్రవహించుచున్నది. పలుచోట్ల 'తెలుగు కింత లగువు బిగువు కలదా' యని యాశ్చర్యపడునట్లు చేయు నుడికారము లిందు గలవు..."


శ్రీ శాస్త్రిగారికి వశమైన కవితాకళ యెట్టిదో, యీ పద్యము స్పష్టపఱుచును.


చ. పరహిత, మాత్మనిర్వృతి, యపారయశోధన గౌరవాది వి

స్ఫురణము లందజేసి యిహమున్ బరమున్వెలయించి, మాధవున్

థర జరితార్థు జేయు కవితాకళ నావశమౌట బంచమ

స్వరమున నాలపించెద వసంత వనాంతర సాలశాఖలన్.


'శ్రీ శివభారతము' వసంతకోకిల పంచమస్వరలావము. దాని మాధుర్యము నూరక పేరుకొనుట వ్యర్థలాపము. అయినను, నాహృదయము విప్పక మానలేను.


'శివభారతము' మొదటినుండి తుదిదాక నొకే తీరుదీయముగల కవితతో సాగినది. గ్రంథమంతయు రసఘటిక. విశేషించి, లుకజీ-జీజియాల సంభాషణము, దక్కనులో బహమనీ రాజ్యములు - పరిపాలన పరిస్థితి, శివాజీ పునహాలో రాజ్యాంగ శిక్షణము, దాదోజీ చరమదశ-శివాజీకృతజ్ఞత, రామదాసుదర్శనము-ధర్మోపదేశము, సయీబాయి సలహా-భవానీప్రార్థనము, శివాజి పాదుషా కుత్తరమువ్రాయుట, షాజీ విడుదల, బాజీప్రభు మరణము, శివాజి సానుభూతి, షాజీ మరణము, శివాజీవిచారము, శివాజీ పాదుషా కొల్వున కేగుట, తానాజీ ప్రతిజ్ఞ-సింహగడము లగ్గవట్టుట, సూర్యాజీ సింహగడము గెల్చుట, తానాజీ నిర్యాణము, శివాజీ సంతాపము, పట్టాభిషేక పూర్వరంగము, శివాజీ