పుట:AndhraRachaitaluVol1.djvu/369

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తేమిసేయుదు నాభాగ్యమిట్టులుండె - ఎద్దీనెనన్న వెసంగొట్టమునందు గట్టు డనుచందంబయ్యె - తల్లి జంపువానికి బినతల్లి చేతులు గణింప జివుళ్లను చొప్పెఱుంగవే? మొదలన్నెత్తురు పంచుకొం చనుజుడై పుట్టొందె - నీముఖము సందె ప్రొద్దు పొడుచునె? - పిల్లికిన్ జ్వరమనంగా జెల్లె - కాడుగా మాఱి పాండవబీడు దేలె - చెంతజింతామణిని వీడి చిల్లిగవ్వ కెగుబుజము చూప నెవ్వాని మొగము వాచె - వట్టి పెడసరికట్టె యన్పించుకొనుటె - ఇత్యాదులెన్నో ప్రతాపసింహచరిత్రలోని కవితకు సొగసుమెఱుగులు తెచ్చుచున్నవి. ఈక్రిందిగీతము లెంత మెలకువగా నడిపిరో కనుడు:


చూలుపండిన యా హమీడా లతాంగి

జిచ్చుటెండ కెడారిలో దెచ్చు టెల్ల

బూప పిందెల క్రొమ్మావి మొక్క నకట!

తీవ్రదావాగ్నిలో నీడ్చి తెచ్చుటయ్యె.

ఎట్టి బ్రహ్మ ప్రయత్నంబునేని జేసి

యుదయపురలక్ష్మికి గిరీట ముంతు దలను

గాక దైవోపహతు డనై కడిమి చెడిన

రక్త తతి గూర్తు రతనాల రావిరేక.

వీరి సీసపు నడక శ్రీనాథుని స్మరణకు దెచ్చుచుండును.


సీ. క్ష్మాగోశమును ముంచు గాడాంధతమనంబు

గరదివ్వెతో నార్ప గడగునట్లు

అత్యగాధము సాగరానంత జలముల

కేతమ్ము వేయ నూహించునట్లు

వసుద బొగ్గుగ గాల్చు ప్రళయాగ్నిహోత్రంబు

గన్నీటిచే నార్ప నున్న యట్లు