పుట:AndhraRachaitaluVol1.djvu/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుర్భాక రాజశేఖర కవి

1888


ములికినాటి శాఖీయ బ్రాహ్మణులు. తల్లి: సుబ్బమాంబ. తండ్రి: వేంకటరామయ్య. జన్మస్థానము: జమ్ములమడుగు. నివాసము: ప్రొద్దుటూరు. జననము: 18-10-1888 సర్వధారి సంవత్సర కార్తిక శుద్ధ పంచము. కృతులు: 1. వీరమతీ చరిత్రము (3 ఆశ్వాసముల పద్యకావ్యము) 2. చండనృపాల చరిత్ర (పద్యకావ్యము) 3. సీతాకల్యాణము 4. సీతాపహరణము 5. పద్మావతీ విజయము (ఈ మూడును నాటకములు) 6. విలయమాధుర్యము (స్వప్నకావ్యము) 7. వృద్ధిమూల సంవాదము (నాటకము) 8. అవధానసారము 9. రాణాప్రతాపచరిత్ర (5 ఆశ్వాసముల పద్యకావ్యము) 10. The Heroines of Hindusthan (ఆర్యావర్త వీరనారీమణులు- ఆంగ్లభాషా వచనగ్రంథము)


శ్రీ దుర్భాక రాజశేఖరముగారు తొలుత గవియై, తరువాత నవధానియై, పిమ్మట మహాకవియై రాయలసీమలోను యావదాంధ్ర సీమలోను మంచి యశస్సు నార్జించుకొన్నారు. వీరికి దేశము కావ్యకళానిధి, కవిసింహ, అవధాని పంచానస, కవిసార్వభౌమ, మహాకవి చూడామణి, వీరకవితా వీర, అభినవతిక్కన, వీరప్రబంధపరమేశ్వర, చారిత్రక కవిబ్రహ్మ, సుకవిరాజరాజ, కవితాసరస్వతి, వీరగాధా విధాత, చారిత్రక కవితాచార్య, వీరరస రత్నాకర, మహాకవి మార్తాండ మున్నగు నెన్నో యుపాదు లొసగి వందించుచున్నది. ఇది దేశమునకున్న వెఱ్ఱి గాని, రాజశేఖర కవి కివియేవియు నవసరము లేదు. కవి, దానిని దాట దలచినచో 'మహాకవి' యన్న బిరుదము చాలును. దీనియెదుట బై పట్టిక సర్వము వంది వాజ్మయములోనికి జేరును. దేశము తన కర్తవ్య మింతమాత్రమేయనుకొని కొంతవఱకు నాచరణలో బెట్టికొన్న దేగాని, ఎవని నుద్దేశించి లోక మిట్టి బిరుద సంతావ