మతము. యతిప్రాసములు, శబ్దాలంకారములు వసరి పారవేయ వలయునన్న యభిప్రాయము వీరికి లేదు. పద్యముల నడుమ వచనము నిరికించుటను శాస్త్రిగారు సహింపరు. అందులకే వీరివన్నియు బద్యనాటికలు, గీతినాటికలును. కావ్యాత్మరసమన్న వాద మనుసరింతురు. ఉపాసనలో శైవము, మతములో నద్వైతము వీరారాధింతులు. రాధాకృష్ణ భక్తి యనిన యాసక్తి మెండు. "పద్మావతీ చరణ చారణ చక్రవర్తి" రచనము నీ భక్తియే పురికొల్పియుండవచ్చును. శాస్త్రిగారికి బౌద్ధములో మంచి ప్రవేశ మున్నది.
1930-31 లోను, 1932 లోను రాజకీయ విషయకముగ సంచరించి కారాగార ప్రవేశము చేసిరి. అక్కడ యువకుల నెందరనో కవులుగ, నటకులుగ, కథకులుగ దిద్ది ప్రోత్సహించినారు. తెలుగులో నన్నయ - తిక్కన - శ్రీనాథులు వీరి ప్రేమకు స్థానమైన కవులు. భట్టుమూర్తి మీద, అంతకంటె వేయిరెట్టులు పోతనమిద వీరికి భక్తి హెచ్చు.
అభినవాంధ్రకవి నిర్మాణమునకు శాస్త్రిగా రొక యంత్రమని చెప్పుకొందురు. నాలుగు గేయములు గొలుకు కవి దగ్గరనుండి, మేలిమి కావ్యములు సంతరించు కవిదాక బుజ్జగించి చేరదీసి యోపికతో వారి రచనలు సరిచేసి, అవసరమైనచో దా నొకప్రతి వ్రాసి, ప్రచురణమున కుపాయములు సూచించి సహృదయత శాస్త్రిగారిలో ఘనముగ నున్నది. కృష్ణా గుంటూరు మండలములలో వీరి మూలమున బేరునకు వచ్చిన రచనలు బెక్కు రున్నారు. శాస్త్రిగారి నెవరోగాని "చాకిరేవు" అని పరిహాసము చేసిరట. దీని యంతరార్థము, "ఎందరో కవులు తమ రచన వస్త్రము లిక్కడ ఉదుకుకొని పోవుదు" రని - నవ్య సాహిత్య పరిషత్ప్రచురణములపై వీరిచేయి పడనిది లేదన వలయును.
శివశంకరశాస్త్రిగారు వంగభాషలో నుండి శ్రీ శరత్ చంద్ర చట్టోపాధ్యాయుని రచనములు తెలుగులోనికి దెచ్చిన వారిలో మొట్ట