Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారము మోసినవారు శివశంకర శాస్త్రిగారు. సాహితి, సఖి, పత్రికలకు వీరు సంపాదకత సాగించి నవ్యసాహిత్య పత్రికలకు మెరవడిగ యొరవడి పెట్టినారు. ప్రతిభ కు సంపాదకవర్గములోని వారని జగమెరుగును. ఆఖ్యాయికా పరంపర, సాహితీ సమితి పరంపర, సరస్వతీ గ్రంథ మండలి, విశ్వజనీన గ్రంథావళి, ఆంధ్రప్రచారినీ గ్రంథమాలలకు బడిన శాస్త్రిగారి సంకలనముద్ర లొకవిదితమైనది. అదిగాక, శివశంకర శాస్త్రిగారి కచ్చువనులలో నసాధారణమైన తెలివియున్నది. ముద్రణ సౌందర్యము కొరవడిన గ్రంథమాయన ముట్టడు. ఆయన వ్రాత పుస్తకము ముద్రిత పుస్తకములవలె నంతరించుకొనును. అచ్చుతప్పులున్న గ్రంథము నాయన మెచ్చడు సరికదా, అది తెలుగువారి యసడ్డయని విసుగుకొనును. తాను సంపాదించిన పత్రికలకు బంపిన వ్యాసములకు సొంతముగా మరియొక ప్రతివ్రాసి మరి యచ్చున కిచ్చుచుండ నలవాటీయనలో నున్నది. రమణీయార్థము నెంత యారాధించునో, గ్రంథ బహిస్సౌందర్యమునంతగా నారాధించుక వినరులు శివశంకర శాస్త్రిగారు.


కవితతోపాటు శిల్పము- చిత్రకళ ఈ రెండు వీరిని వలపించిన కళలు. ప్రత్యేకించి యాకళలలో రెండు మూడేండ్లు పరిశ్రమించిరి. పాచ్య పాశ్చాత్య శిల్ప-చిత్రకళలలో వీరికి గల పరిచితి, ఖండాంతర వాసుల పరిచయమును జేకూర్చినవి. కాని, శాస్త్రిగారిది వేసిన శిల్పము, - చిత్రము నేవరయలేదనుట చిత్రము కాదు. ఆయననేమి! ఆయా కళా విజ్ఞాన సంబంధి గ్రంథము లెన్నో వాజ్మయములలో వారు చదివియుందు రనుటలో నాశ్చర్యము లేదు.

................ ....................... ..................... ............... ................ ...............

(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)