వాడుక. వాడుకయేగాని రెడ్డిగమువైచుకొని శిష్యులకు బాఠప్రవచనము చేసినవాడు కాడు. ఆయన, అధమపక్షము 'మెట్రీక్యూలేషన్ ' పరీక్షలోనైన సముత్తీర్ణుడు కాకపోయి యుండడని కొందరి నమ్మకము. నమ్మకమే కాని, నిజమున కాయన యటులు కాలేదు. పరీక్షకు గూరుచుండి జామిట్రి ప్రశ్నపత్రము చూచుసరికి విరక్తి గలిగి, కాగితములపై బొమ్మలుగీసి యిచ్చివైచెనట. ఆ యుచితజ్ఞఉడు రేఖాగణితమునకు రేఖలతో సమాధాన మీయవలయు ననుకొన్నాడు కాబోలు ! శివశంకరశాస్త్రి గారికి సా ప్రాకృతములు, వంగము, మహారాష్ట్రము, హిందీ, మున్నగు వాజ్మయములతో జక్కని పరిజ్ఞానమున్నదట. గ్రీకు, లాటిన్, జర్మన్ సారస్వతములు సవిమర్శముగ జూచిరట. శాస్త్రిగారు మహాకవులని నేటి సాహిత్య ప్రపంచమున నొక ప్రతీతి. ఆలోచించినచో నచ్చుపడినంతలో నాయనవి మహాకావ్యములు లేవు, ఉపకావ్యములు, ఖండకావ్యములు, గీతినాటికలు, పద్యనాటికలు తప్ప తల్లావజ్ఝలవారు అమ్ంచి కథకులను --ములో బ్రథితి. వంగము నుండి హిందీ నుండి యనువాదములే హెచ్చు. " నీలకంఠం కథలు " మాత్రము చాల వ్యాప్తిలోనికి వచ్చినవి. శాస్త్రిగారికి సంగీతములో నుత్సాహమున్నది గాని, మధురముగా బద్యము చదువగ నేను వినలేదు. ఆయనకు శిల్ప చిత్రకళలలో నెనలేని --- వానిలో ప్రత్యేకమైన పరిజ్ఞానము కూడ సంపాదించిరి.
...................
.........................
........................
..................
..................
.....................
(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)