పుట:AndhraRachaitaluVol1.djvu/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొయిలురాయడ ! యిట్లు మొదటివియుక్తి

జాలశోకించు నీసకియ నో దార్చి

సంది కోరాటలన్ సలగు నా వెండి

మలనుండి వేవేగ మరలి యే తెంచి

తగినగుర్తులతోడ దరళాయతాక్షి!

పంపిన నేమపంపువార్తలం దెల్పి

వేబోక తఱిమల్లె విరివోలె బ్రిదిలి

తలరు నా జీవము న్నిలుపంగదయ్య!

    *      *      *     *

ఇట్లు నీదు మెఱుంగు టిల్లాలితోడ

నీకెన్నడు వియుక్తి లేకుండుగాక!

ఈ మొయిలు రాయబారములోని గేయముల తీరుననే "శ్రీ భగవద్గీతామృతము" కూడ రచించిరి. కృష్ణార్జును లిరువురు నిందుపాత్రలు. ఈ గ్రంథమింకను ముద్రణము లోనికి రాలేదు.

శ్రీ సూర్యప్రసాదరావుగారు తెలుగు కవితలో మంచి మంచి మెలకువలు తెలిసిన సరసకవులు. కవితలో నధునాతన భావములు వీరియందున్నవిగాని, భాషావిషయకమైన సంస్కారము వీరికంగీకారము కాదు. 1927 లో బళ్ళారిని జరిగిన ఆంధ్రసాహిత్య పరిషద్వార్షిక మహాసభకు వీరి నధ్యక్షులుగా నెన్ను కొనిరి.

1922 సం. జూలై 18 వ తేదీన్ జార్జిచక్రవర్తి కుమారుడు 'ప్రింస్ ఆఫ్ వేల్సు' మదరాసు సెనేటు హాలులో శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి, చదలువాడ సుందరరామశాస్త్రి గారలతో పాటు మన ప్రసాదరావు గారికిని సువర్ణకంకణము, సాలువలు నొసగి గౌరవంచిరి. ఈడెశి