పుట:AndhraRachaitaluVol1.djvu/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బద్దెమ్ములో బాట పాటలో బద్దెమ్ము

గూడి రా హాయిగా బాడ నేర్చు

నరటిపం డొలిచి తానరచేత నిడురీతి

భావార్థముల దేటపఱుపనేర్చు

గానాభినయ నాట్య కవితాకళల గూర్చి

యరుదార నాటకా లాడనేర్చు

సర్వగతుల నీకును సంతనమ్ము గూర్చు

గాళిదాస సత్కవి మేఘ కావ్యకల్ప

పుష్ప సౌరభ లహరికా మూర్తి యైన

మా మొయిలు గబ్బపుంగన్నె భూమహేంద్ర! [మొయిలు రాయబారము]

పలువన్నె జోతి రేకల చుట్లతో గూడి

పొలుపారునే నెమిలిపురికన్ను పట్టూడి

యిలరాల గొడుకుపై గల ప్రేముడిని దాని

గలువఱే కిడుచెవిం గయినేయు నాగౌరి

నెలతాల్పు శిరసు వన్నెలలచే సెంతయు

దెలుపారు కన్ను గొల్కులతోడి గుహుని య

ప్పులు గుదత్తడి నవల మలగపుల మఱుమ్రోత

లలమ బిట్టుఱిమి గొండిలికి దార్సగదన్న! [క్రొమ్మెఱపు...]

ఇట్టి కవితతో నున్న యీ 'మొయిలురాయబారము' క్రొత్తతీరు గలదైనచారువుగా నున్నదనుట నిర్వివాదము. యక్షుడు చిట్టచివర మేఘున కనుచున్న మాటల యందపు బొందిక కనుగొనుడు! కాళిదాసుని కవితతో వియ్యమందు చున్నదిగదా!