పుట:AndhraRachaitaluVol1.djvu/271

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పీటపై గూర్చుండి పిలువనంపక యుండ

నేదినమ్మున భుజియింపలేదు

మొదటినుండియు దుట్టతుదదాక నొకరీతి

గురుభావమున లోటు జరుపలేదు

ఇట్టిరీతిగ బదు నెన్మిదేండ్లు జరిపి

కృష్ణ భూపాలకుడు దివి కేగె నేటి

కాయనకు నాకుం గల్గు ఋణానుబంధ

మక్కటా ! దైవదౌర్బల్య మణచివైచె.

సీ. రచియించినాడ బుద్ధచరిత్ర కృతిగాగ

మేలినాటకములు మృచ్ఛకటిక

బాలరామాయణ పాండవవిజయము

ద్రారాక్ష నేడ్వర్డురాజమౌళి

పట్టాభిషేకముల్ పావనయుష్మదా

ఖ్యాభూషితమ్ములుగా నొనర్చి

నీకీర్తి కాంత కీలోకమ్మునందు వ

సించుసౌధమ్ము నిర్మించినాడ

బండితుడు కవి మిత్రుడు బాంధవుం డ

నంగమెలగితి దానికి నాకు నీవి

చేయు ప్రత్యుపకార మిస్సీ! మహాత్మ !

వదలి దివి కేగుటా కృష్ణవసుమతీంద్ర!

గీ. శనిమహాదశ మంచియుచ్చదశ యంచు

బల్కు కార్తాంతికుల పల్కుబడు లనృతము

లనగ శనిదశలోని శన్యంతరమున

గుజుడు పాపాత్ముడగుచు మాకొంప దీసె