పుట:AndhraRachaitaluVol1.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1913 లో విజ్ఞానసర్వస్వరచనోహ పంతులుగారికి గలిగినది. వారి యావచ్ఛక్తి ఆంధ్రవిజ్ఞాన సర్వస్వ సంపుటము లపహరించినవి. అది యసంపూర్ణమైనను నాయన యశస్సున కనశ్వరత్వ మీయగల కూర్పు. పంతులుగారి యెత్తుగడలన్నియు బ్రహ్మాండమును బోలునవి. వన్నుగడవన్ని పట్టుపట్టి నిర్వహించుట వీరిలో మెచ్చదగిన సుగుణము. విజ్ఞానసర్వస్వ పునరుద్ధరణమునకు మఱియొక లక్ష్మణరావు-ఇంకొక నాగేశ్వరరావు అవతరింపవలయును. ఆ యదృష్టమెన్నటికో?

ఈమహాశయు డుద్యమించిన 'ఆంధ్రీ' సంపుట సంకలనము తుదముట్టినచో దెలుగు బాసకు వెలలేని తొడవయ్యెడిది. మల్లంపల్లి సోమశేఖర శర్మవంటివా రెందఱో లక్ష్మణరావుగారి లక్ష్యమున నడచి పరిశోధకులలో బెద్దపద్దు సంపాదింపగలిగిరి. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' రచించి తెలుగున మెచ్చులుగాంచిన బండారు అచ్చమాంబగారు లక్ష్మణరావుగారి సోదరీమణి.

                        ___________________