పుట:AndhraRachaitaluVol1.djvu/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాకల న్విలసిల్లు నెప్డుచెడకుండన్, దీని నాంధ్రావనీ

ప్రాకామ్యంబగు 'యూనివర్సిటి' వహింపంజెల్లు స్వత్వంబుగన్.


ప్రాచీనకాలమున బెద్దనాది కవిపితామహులు పడసిన యిట్టి మహామహిత సన్మానము లిపు డీకవిరాజు పొందుట యానందవిషయము. మఱియు నీయన స్వదేశసంస్థానములలో గొన్నింట శతాష్టావధానములు ప్రదర్శించి సన్మానితులైరి. బంగళా రాజధానిలో 'మయూర భంజి' (మౌరోబంజి) పట్టణమునకు బోయి యా సంస్థానాధీశుని మ్రోల సంస్కృతమున శతావధానము చేసి బహుకారము నందినటులు వారి చరిత్ర చెప్పుచున్నది. శాస్త్రులుగా రాయా సందర్భములలో జెప్పిన సమస్యా పూరణములు, చాటువులు స్మరింప దగియున్నవి.


అవ్వతాతా, డంకానగారా, రా రా పోరా, మేనా సవారి అను మాటలు వచ్చునటులుగా, ఊర్వశి యర్జునుంగోరి యతడు తనకు వశుడు గామింజేసి పడిన విరహమునుగూర్చి వ్రాయమనగా శాస్త్రులుగారిటులు వ్రాసిరి.


శా. ఆ పాకారి కుమారుడట్లు విభవం బవ్వారిగా రాగ, రా

రాపోరా యను సందడిం బడు సుధర్మంజూచి నే నవ్వతా

తా పాల్మాల నరింప కేగెనను వా డంశానగారా కహా

మీపాలం బడితింజెలున్ మనుప రే మేనా నవారించితిన్.


"వడ్డాణ మలంకరించె వనితకుచములన్"- కుళీరకుహరే కరీ పరిలునాతి పంచాననమ్" ఈసంస్కృతాంధ్ర సమస్యలకు కృష్ణమూర్తి శాస్త్రిగారి పూరణము లుదాహరణీయములు.