Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నారన్నది నా కనుగొన్న సంగతి. శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువున చి.ని. అను సంకేతాక్షరములతో నున్న పద సందర్భము లరసిన నిది విశదము. సూరి స్వహస్తాక్షరములతో నక్షిపర్వ మొనరించుచున్న యసంపూర్ణ నిఘంటుపత్రములు భాషాచరిత్రమున శాశ్వతముగ గల్పించుకొనగలవనుటలో నాశ్చర్యము లేదు. శబ్దరత్నాకరకారుల యీ వాక్యములువినుడు.

"సంస్కృతాంధ్రములయందు విశేష పాండిత్యము కలిగి యాసేతు హిమాచలము చాలబ్రసిద్ధి వహించియుండిన పరవస్తు చిన్నయసూరిగారు జీవితులై యుండిన కాలంబున దీర్ఘనూత్రతతో ననేక గ్రంథపరిశోధనంబు గావించి మిగుల విరివిగా బ్రయోగసహితంబుగా అకారాది తెనుగు నిఘంటు వొకటి వ్రాయం బ్రారంభించి నడపుచుండిరి."

ఈ మాటలను బట్టి చూచిన సీతారామాచార్యులవారికి సూరిపై గల గౌరవభావమును, శబ్దరత్నాకరమునకు సూరి నిఘంటువుతోగల సంబంధము విస్పష్టమగును. ఆచార్యులవారి "ప్రౌఢ వ్యాకరణము" లోని సూత్రములకును, అచ్చున కెక్కని సూరి సూత్రములకును గొన్నింట గురుశిష్య సంబంధమున్నది. సూరి "బాలవ్యాకరణ శేషము" ఆంధ్రియభాగ్యవశమున సశేషమైపోయినది.

బాలవ్యాకరణము

బాలవ్యాకరణము నకు చిన్నయసూరి యని ప్రసిద్ధవ్యవహారము. కిరాతార్జునీయమునకు భారవి యని, శిశుపాలవధమునకు మాఘమని పేరులున్నవి. టెన్నిసన్ చూచితిరా? షెల్లీ చదివితిరా ? యనునది పాశ్చాత్యము. తెలుగున నిట్టివాడుక చిన్నయసూరికి దక్కినది. సూరి కీర్తిచంద్రికకు బాలవ్యాకరణము శారదరాత్రి. సంస్కృత భాషావ్యాకరణములెన్నో యున్నవి. కాని పాణినీయముముం దవి నిలబడలేక పోయినవి. తెలుగున జాలమంది వ్యాకర్తలు పుట్టిరి. వారు చిన్నయ సూరికి లొచ్చు. దీనినిబట్టి సూరిని కాదనిపింపగల శాస్త్ర పండితులు