పుట:AndhraRachaitaluVol1.djvu/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటోద్యోగములు మాత్రము రచించిరి. అది నేటి కచ్చుకాలేదు. మతుకుమల్లి నృసింహకవి పితామహుడు మాధవకవి 'అభినవభారత' మనుపేర భారత మాంధ్రీకరించె ననియు, నం దాదిపంచకము మిగిలి తక్కినది తాడిపర్తి గ్రామములో దగులబడిన దనియు దెలియుచున్నది. కవిత్రయభారతముతరువాత శ్రీకృష్ణభారతమే సంపూర్ణముగా రచింపబడి సమగ్రముగా ముద్రణమునకు వచ్చినది. నన్నయభట్టారకుడు గంటముపట్టి భారతరచనకు గడగిన రాజమహేంద్రవరముననే కవిరాజు కలముపట్టి మహాభారతము పూర్తిచేయుట మెచ్చుకొన దగినది. శాస్త్రిగారి షష్టిపూర్తితో పాటు భారతరచనా పూర్తియు నగుట మఱియు మెచ్చుకోదగినది. ప్రాచీనభారతముతో శ్రీకృష్ణ భారతము కూడ రసికరంజన మొనరించుగాక! కృష్ణభారతకవిత యిటులు జాలువాఱుచుండును.


ధృతరాష్ట్రుడు భీష్మపతనమునకు దు:ఖించు ఘట్టములోనివి:

చ. కురు వృషభుండు భీష్ము డెటుకూలెనొ నేలకు నాశిఖండిచే

శరములచే హతుండయి విసంజ్ఞతనెట్లు వహించెనో సుతుల్

దొరనటు కోలుపోయి యెటు తొట్రిలుచుండిరొ నీనుడు ల్వినం

గరము మదీయమానసము గంపమునొందెడు నార్తి గుందెడున్.


ఉ. ఎవ్వరతండు పాండవుల కేడైఱజూపుచు దద్బలంబులం

ద్రెవ్వగసేయ సేగుతఱి ధీరతతో మునువోవ జాలిరో

యెవ్వరు వెంబడింజనిరొ యెవ్వరు వానికి దోడుసూపిరో

యెవ్వరు వానిగ్రవ్వుకొని యెప్పుడునుండిరొ చెప్పు సంజయా!


ఉ. వేడెవెలుంగు చీకటుల వేయికరంబుల నూడ్చిపుచ్చున

ట్లోడ కతండు శాత్రవుల యుబ్బరమెల్ల నడంచివై చుచో