పుట:AndhraRachaitaluVol1.djvu/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అతికష్టంబుగ నిట్లు కాలమును ద్రోయంజాలి యున్నప్పుడున్

గృతినిర్మాణము మానకెట్లొ యిరుమూడే పర్వముల్ పూర్తి చే

సితి ద్రోణంబు దొడంగి యార్జుని వధంబున్ వ్రాయుచున్నప్డు నా

సుతునింజెంద 'హాతో సిమేసుత' యటంచున్ ఫల్గునుండేడిచెన్.


అది తెలిగించు నామమునం దొకసందియ మావహిల్లె న

య్యదనున నాసుతా! యనక హాసుతయంచు దెలుంగుసేయగా

మొదలిడినాడ; నాసుతుడు పొంత వసింపగ రాగ, నిప్పుడి

ప్పదనున నుండకంచు నెడ బాపుడు నైన దిగు ల్మదిం బడెన్.


ఈసంశయముతో గ్రంథము రచించుచుండ దైవవశమున నీభారతకవి కుమారరత్నము 'సుదర్శనసుధి' యనునతడు స్వర్గతుడయ్యెను. ధైర్యశాలి యగు కవిరాజు గర్భశోకము డిగద్రావి భారతము సాంతము రచించెను.


శ్రీకృష్ణ మహాభారతమునకు రాజరాజ నరేంద్రుడు ముక్త్యాలసంస్థాన ప్రభువు శ్రీరాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాదరావు. పాలకొల్లు వాస్తవ్యులు, వణిగ్వరులు నగు శ్రీ రేపాక సత్యనారాయణమూర్తి, శ్రీ చుండూరి నారాయణరావుగారలు భీష్మద్రోణపర్వములు, కర్ణశల్య సౌప్తిక స్త్రీపర్వములు మాత్రము కృతినొంది స్వర్ణాభిషేకముచే గవిరాజును గౌరవించిరి. సంస్కృత మహాభారతము నన్నయభట్టార కాద్యాంధ్ర మహాకవిత్ర యాంధ్రీకృతమైన పిమ్మట మరల దానిని పద్యరూపముగ ననువదింప సాహసించి పరిపూర్ణముగా గృతార్థులైనవారు వీ రొక్కరే. ఆంధ్ర వ్యాసులని కొండాడ బడిన ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రిగారు 'ఆంధ్రమహాభారత నవనీత' మను పేరితో బదుమూడుపర్వము లనువదించిరి. అం దాదిపర్వము మాత్ర మిటీవల నచ్చునకు వచ్చినది. శ్రీ తాడూరి లక్ష్మీనరసింహకవి భారతాంధ్రీకరణమునకు దొరకొని