పుట:AndhraRachaitaluVol1.djvu/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవికి "సంథ్యావందనము బావగారు" అని తిరుపతికవులు కాబోలు చెప్పినారు ఇది ఇటులు సార్వత్రికమనుటకు వీలు లేకుండ మహానిష్ఠాగరిష్ఠులగు పురుషోత్తములు కొందఱు కవిలోకమలో నుందురు. అట్టివారిలో నాదెళ్ళ పురుషోత్తమకవిగారొకరు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు వీరిని గూర్చి వ్రాసిన యీపద్యములు సరిగా దూచిన ట్లున్నవి.


అతిశాంతుం, డతిదాంతుడు

కృతకృత్యుడు, నుకవి, యెన్నియేని విషయముల్

మతినెఱిగినవిద్వాంసుడు,

స్తుతియింపదగిన పూరుషుండు సుకవులకున్.

ఒకనికి లో గని శాంతియు

సకలమ్ము నతిక్రమించు చండత, కడువై

దికకర్మ నిష్ఠయు బరో

పకృతియు బురుషోత్తముని స్వభావగుణమ్ముల్.


పురుషోత్తమకవి తొలుత రేపల్లె లోయరు సెకండరీస్కూలులో నుపాధ్యాయుడు. ఆపదవిలో నుండగానే జ్యోతిశ్శాస్త్రము, ధర్మశాస్త్రము మున్నగువానియందు పాండిత్యము సంగ్రహించెను. 1884 నుండి, బందరు వీరిని హిందీనాటక రచనకు బ్రోత్సహించుచు వచ్చినది. అదివీరి జీవిక కొక క్రొత్త మెఱుగు. "నేషనల్ ధియేట్రికల్ సొసైటి" అనుపేర బందరున నొకనాటక సమాజము వెలసినది. వారికి హిందీనాటకముల సంతరింపజేసి ప్రదర్శింప వలయునని క్రొత్త.................................... ,...................... ................... ..................... ......................

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)