పుట:AndhraRachaitaluVol1.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1937 లో ఆంధ్రేతిహాస పరిశోధకమండలి పంతులుగారికి 75 వ జన్మదినోత్సవము గావించి యాంగ్లములో నభినందన సంపుటము ప్రకటించినది. ఆంధ్రవిశ్వవిద్యాలయము వీరికి కళాప్రపూర్ణబిరుద మొసగి సన్మానించినది. రామయ్యపంతులుగారిది ధన్యజీవితము. సంపూర్ణ విద్యాభ్యాసము గావించిరి. మహోన్నతపదవుల నాక్రమించిరి. దీర్ఘాయుర్భాగ్యము బడసిరి. నంతతహరినామస్మరణము గావించిరి. గొప్పకీర్తిప్రతిష్టలు సంపాదించిరి. అనాయాసమరణము, అదైన్యజీవనము చేకుఱిన మహాశయు డీయన.

ఈయన విశిష్టతను గుఱించి అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి 'చాటుధారాచమత్కారసార' గ్రంథముననిటు లుపశ్లోకించెను.

శ్లో. జయంతిరామ కీర్తిస్తే సకలాశానువర్తినీ సజాత్వసి రజోయుక్తా ప్రసూతే-ర్థి సుతాంబహున్.

శ్లో. శ్రీరామస్య గుణాస్స నామకలనాద్యస్మిన్ జయంతిశ్రితా యజ్జిహ్వాంచల రంగనాట్యలలనా హౌణీలద్రామిడీ గైర్వాణీ ఘనవైకృత ప్రభృతయో భాషా జయంత్యన్వయ శ్రీరామార్యసుత స్సరామయసిధీర్లక్ష్యా చిరంజీవతు!

శ్లో. యస్యాజ్ఞా నరపాలఫాల ఫలకాగ్రాంచన్మణీ పట్టికా తాదృ "గ్యాపిలు" నామహూణనృపతే స్సమ్మానసంధానితాం డైష్టీం, కాల్కటరీం పహన్ భువి జయంత్యన్వయ్య పేరార్యస త్పౌత్ర: కౌశికగోత్రజో విజయతే శ్రీరామయార్యాగ్రణీ.

శ్లో. జయంతి రామార్య మణేర్వచాంసి జయంతి రామార్య లసద్వచాంసి జయంతి రామార్య మణేర్యశాంసి జయంతి రామార్యరిస న్మహాంసి

                         ___________