పుట:AndhraRachaitaluVol1.djvu/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధి నిశితమును, ప్రాతిభ నవనవోన్మేషితమును అగును. శ్రీ శాస్త్రిగారు ఆశించిన పరమార్థమే యిది.

శ్రీ శాస్త్రిగారి ప్రతిభా ప్రాగల్భ్యములు మన పండితకవులు ఇదివరకే లెస్సగా గుర్తించియున్నారు. ఈ గ్రంథము శాస్త్రిగారికి జయపతాకయు, పండితకవులకు ఆనందోచ్ఛ్వాసమును కాగలదు.

ఈ రెండును నాకు వెలలేని భూషలు.

శ్రీ సత్యనారాయణశాస్త్రిగారితో నాకు ఇట్టి మైత్రి సంఘటించిన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి నేను నాకృతజ్ఞత తెలుపుకొనుచున్నాను.

ఆంధ్రమహాజనులు, ఈగ్రంథము గౌరవము గుర్తించి, ఆదరించి, ఇంక నిట్టి యుద్గ్రంథములు ప్రకటించునట్లు నా కుత్సాహము కలిగింతురని ఆశించుచున్నాను.


రాజమహేంద్రవరము ఇట్లు

15 - 9 - 1950 అద్దేపల్లి నాగేశ్వరరావు

                                                సరస్వతీ పవర్ ప్రెస్సు అధిపతి