పుట:AndhraKavulaCharitamuVol2.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరవి శ్రీనాథు డాచరిత పద్యప్రబంధముచేసె ద్విపదలు తఱుచునిలిపి

యాతండె పద్యకావ్యముచేసె నైధష మంచితహర్షవాక్యముల బెట్టి


సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి

గరిమ బసవపురాణంబు గణనజేసె

గాన బూర్వకావ్యము వేఱుగతిరచించు

వారి కాదికావ్యోక్తులు వచ్చినెగడు.


"సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి...బసవపురాణంబు...చేసె" నన్న పయివాక్యమునుబట్టి వేములవాడ భీమకవి నన్నయభట్టారకుని కాలములోనివాడుగాక పాల్కురికి సోమనారాధ్యున కెంతో తరువాత నుండినవా డయినట్టు విస్పష్టమగుచున్నది. ప్రతాపరుద్రునికాలములో ప్రతాపరుద్రుని మంత్రులలో నొకడును తన శిష్యుడును నయిన యిందుటూరి యన్నదండనాధుని సాహాయ్యముచేత పాల్కురికి సోమనార్యుడు గ్రంథకర్త పూర్వులకు దోకిపర్తియను నగ్రహారమిప్పించెను. ఈయగ్రహారమునకు దరువాత భంగము కలుగగా గ్రంథకర్తయొక్క ముత్తాతయైన సోమనారాధ్యుడు ప్రౌడదేవరాయని రాజ్యకాలములో దానిని మరల సంపాదించెను. ఈసంగతి బసవపురాణములో నీక్రింది పద్యమునందు జెప్పబడినది.


క. ఆదిన్ బ్రతాపు డిచ్చిన

యాదోకిపురంబు నడుమ నంకిలిపడినన్

మోదమున బ్రౌడరాయమ

హీదయితునినలన దెచ్చె నెల్లరు నెఱుగన్.


కృతికర్తయైన సోమనాథుని తండ్రి బసవయ్య, బసవయ్యతండ్రి దేవయ్య, దేవయ్యతండ్రి సోమనాథుడు. కాబట్టి ప్రౌడదేవరాయని రాజ్యకాలములో దోకిపర్తి యగ్రహారమును మరల సంపాదించిన