పుట:AndhraKavulaCharitamuVol2.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయుట యుచితముకాదు. అయినను గవిత్వరీతి దెలుపుట కయి కవిచింతామణినుండి రెండుపద్యముల నిందుదాహరించుచున్నాను-


క. ఆది బురాణాగమములు

వేదంబులు నోరగాయవేయక నుడువన్,

నాదేలా కవినరులకు

మేదిని నెవ్వారు సాటి మించినగరిమన్.


శా. ని న్నాడింపగవచ్చు గోపతనయుల్ నెయ్యంబున న్వేదిపె

నున్నా రీకడిగొమ్ము జోగులు కరాళోష్మతులై వచ్చెదల్

వెన్నా మీగడయున్ ఫలం బొసగెదన్ వేగంబెరా రమ్ము మా

యన్నాయంచును వ్రేతపెట్టు హరి యో యమ్మా నగు న్మాటిచె.

                            __________


13. కుమ్మర మొల్ల

రామాయణమును తెనుగున రచియించిన యీమొల్ల ఆతుకూరి కేసనసెట్టి కూతురు. ఈమె తనపుస్తకమున వంశమునుగూర్చి చెప్పుకొనకపోయినను, ఈమె కులాలవ ..... పరంపరగా వాడుకవచ్చుచున్నది. ఈమె నివాసగ్రామము ...... డనియు, ఈమెయు తిక్కన సోమయాజులు భారతమును రచించి నప్పుడు లేఖకుడుగానుండిన కుమ్మరగురునాథుడును సోమయాజుల తండ్రియైన కొమ్మనకు రంగప్ప యనుకుంభకారుని పుత్రివలన జన్మించిరనియు, కొందరు వ్రాసియున్నారుకాని యావ్రాత నిరాధారమయినది. ఈమొల్ల తిక్కనసోమయాజి కాలములోనే యుండిన దయిన పక్షమున,