పుట:AndhraKavulaCharitamuVol2.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూరితన్నేహపూరంబు పొంగిపొగల

జల్లనిపటీరసలిలంబు చల్లరాదు.


అనుపద్యమును చేయించి తాము రచియించిన పద్యముగా జెప్పి తమగురువునకు సమర్పించినట్లును రామరాజభూషణుడాపద్యముయొక్క చమత్కృతికిసంతోషించి దానిని తనవసుచరిత్రమునందు వేసికొన్నట్లును, ఒక పుక్కిటపురాణము కలదు గాని యది యెంతమాత్రమును విశ్వాసపాత్ర మయినదికాదు. కృష్ణదేవరాయలకాలములో రామరాజభూషణుడు కవిత్వమును జెప్పుట కారంభించినట్లే కనబడక పోవుటచేత నాతని కప్పటికే శిష్యబృంద మున్నదన్నవార్త యసందర్భ మగుటనుబట్టియు, వసుచరిత్రము కృష్ణదేవరాయల యనంతరమున ముప్పదియేడు సంవత్సరముల వఱకును బ్రకటింపబడక పోవుటచేత నంతటి మహాప్రౌడ గ్రంథమును రచియించిన రామరాజభూషణు డొక్కపద్యమును రచించుట కశక్తు డయి యంతకాలమునకు తరువాత నితరకవియొక్క పద్యమును దనదిగా దనపుస్తకమునందు జేర్చుకొనె ననుటకంటె హాస్యాస్పద మయినమాట వేఱొకటి లేకపోవుటనుబట్టియు. ఈగ్రంథచౌర్యకథ కల్పననిపుణులదేకాని కవిది కాదనుట స్పష్టము.

రామభద్రకవియొక్క కవితాపటిమనుజూచి రామరాజభూషణుడు మాత్సర్యగ్రస్తు డయి యతడుచేసిన రామాభ్యుదయము యొక్క ద్వితీయాశ్వాసములోని "సింహ నఖాంకురచ్ఛిన్నే" త్యాది పద్యమును జదివినప్పుడు "పృథుల షడ్జస్వరోగ్గీతభిల్లపల్లనాధరాగీతికాకర్ణ నాతిభీతిపరవశాత్మపటీరకోటరకుటీరలీఫణి" యనుచో వీణానాదమునకు ధణులు బెదరుట స్వభావవిరుద్ధమని తప్పుపట్టె ననియు, దాని పయిని రామభద్రకవి నెమలియొక్క షడ్జస్వరముచేత బాములు భయపడుట స్వబావసిద్ధమే యని సమాధానముచెప్పి యాతని గర్వ